ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, ప్రస్తుతం చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి ఉన్నారు... అయితే, జగన్ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గునాల్సి ఉంది... ఈ నేపధ్యంలో అక్కడకు జగన్ చేరుకున్నారు... ఒకేసారి అందరూ పైకి ఎక్కటంతో, అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదిక జగన్ వెళ్ళక ముందే కుప్ప కూలింది... ఉన్నట్టు ఉండి సభా వేదిక కుప్పకులటంతో, అక్కడ ఏర్పాట్లు చేస్తున్న, 10 మంది వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి... వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు... జగన్ మాత్రం పక్కన ఉన్న వాహనం పైకి ఎక్కి ప్రసంగం కొనసాగించారు...
అదే జగన్ సభా వేదిక మీదకు వచ్చిన తరువాత ప్రమాదం జరిగి ఉంటే, పెద్ద ఎత్తున స్టేజి పైన నాయకులు, కార్యకర్తలు ఉండేవారు... వారితో పాటు, జగన్ కూడా సభా వేదిక మీద ఉండి ఉండేవారు... అంత మంది ఎక్కి, స్టేజి పడి పోయి ఉంటే, అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి... జగన్ కూడా గాయాల బారిన పడే అవకాసం ఉండేది.. జగన్ రాక ముందే స్టేజి పడిపోవటంతో, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఊపిరి పీల్చుకున్నారు... ఇప్పటికే జగన్, అనేక ఇబ్బందులు పడుతూ, నడుముకి బెల్ట్ కట్టుకుని, శుక్రవారం రెస్ట్ తీసుకుంటూ, నడుస్తున్నారు...
నవంబర్ 6వ తేది నుంచి ‘జగన్ ప్రజా సంకల్ప యాత్ర’కు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. సుమారు 3000 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లా మీదుగా కొనసాగిన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి వద్ద జగన్ పాదయాత్ర చేరుకుంది.