2017 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన చేసారు... ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రెసిడెంట్, సిఓఓ జెన్నిఫర్ జాన్సన్ ను కలిసి, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖ దూసుకెల్తుంది అని, అక్కడ కంపనీ పెట్టాలని చంద్రబాబు కోరారు.. అప్పట్లో ఈ వార్త వచ్చినప్పుడు, కొంత మంది హేళన చేసారు... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీ మన రాష్ట్రానికి ఏమి చూసి వస్తుంది ? చంద్రబాబు మధ్య పెడుతున్నారు అని విషం చిమ్మారు....
అప్పుడు మొదలైన చర్చలు, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ డిసెంబర్ నెలలో, చేసిన అమెరికా పర్యటనలో, సాన్ ఫ్రాన్సిస్కో లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలోక్ సేతి,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొయ్ బోయిరియో ని కలిసి డీల్ క్లోజ్ చేసారు... ఇవాళ జరిగిన క్యాబినెట్ లో కూడా దీనికి ఆమోదం లభించింది... ఐఐటి పాలసీ లో భాగంగా వర్తించే ప్రత్యేక రాయితీలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కు కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది...
పరిశోధన మరియు అభివృద్ధి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెంటర్, కమర్షియల్ స్పేస్, ఉద్యోగస్తులకు ఇల్లు అన్ని కలిపి ఒకే చోట ఉండేందుకు అవకాశం కల్పిస్తూ ఐఐటి పాలసీ ఉంది... విశాఖపట్నం లో ఏర్పాటు అయ్యే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో 5 వేల మందికి మొదటి దశ లో ఉద్యోగాలు లభించనున్నాయి... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 170 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. 1996లో 650 మందికిపైగా ఇన్వె్‌స్టమెంట్ ప్రొఫెషనల్స్‌తో టెంపుల్టన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా దేశంలో తన కార్యకలాపాలను చేపట్టింది...