రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలంటూ తెలుగుదేశం నిర్ణయం తీసుకుని, మిత్ర పక్షం అయిన బీజేపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే... ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా పార్లమెంట్‌లో బిల్లు పెట్టారు... భర్త జైలుకు వెళితే భార్యాపిల్లల గతేమవుతుంది అనే చర్చ వచ్చినప్పుడు, తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది... వెనువెంటనే ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి త లాక్ సర్ట్ఫికేట్లు ఇచ్చే ఖాజీలపై చర్య లు తీసుకోవాలనే డిమాండ్ ఉంది... ఇది ఇలా ఉండగా, ఇప్పుడు మరో విషయంలో తెలుగుదేశం పార్టీ, మిత్ర పక్షం అయిన కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది...

tdp 22012018 2

హజ్ యాత్రకుకు సబ్సిడీ ఇస్తున్న నిధుల నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... ఈ నిర్ణయం పై తెలుగుదేశం పార్టీ, కేంద్రంతో విభేదిస్తుంది... ఇదే విషయం నిన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వర్క్-షాప్ లో చెప్పారు... ట్రిపుల్ తలాక్, హజ్ యాత్రకు నిధుల నిలిపివేతపై విభేదించామని చెప్పారు. ఎన్డీఏతో విభేదించినందుకు టీడీపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధన్యవాదాలు తెలిపారని, సమాజ హితం కోసం సిద్ధాంతపరంగా ఎవరితోనైనా విభేదిస్తామని అన్నారు.

tdp 22012018 3

అలాగే, విభజన సమస్యల పై కూడా చంద్రబాబు మాట్లాడుతూ "విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు గురించి ప్రధాని నరేంద్రమోడికి చెప్పాల్సిందంతా చెప్పాను.ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి వివరించాను.సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములకు సంబంధించి రూ.16వేల కోట్లు రావాలి.తొలిఏడాది ఆర్ధికలోటు రూ.16వేల కోట్లు కాగా 4వేల కోట్లు ఇచ్చారు.రూ.7500కోట్లు ఇస్తామని ఆర్ధికమంత్రి హామీ ఇచ్చారు.మిగిలింది త్వరగా ఇవ్వాలని అడిగాం.ఇంకా గిరిజన విశ్వవిద్యాలయం,కేంద్రీయ విశ్వవిద్యాలయం రెండు విద్యాసంస్థలు రావాలి.నెలకొల్పిన 9విద్యాసంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలి,ఆరేళ్లలో పూర్తి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేయాల్సివుంది.విశాఖ రైల్వేజోన్,కడప స్టీల్ ఫాక్టరీ,దుగరాజపట్నం పోర్ట్ అంశాలను త్వరితగతిన క్లియర్ చేయాలని కోరాం.కాకినాడ పెట్రో కాంప్లెక్స్ గురించి కూడా కేంద్రానికి తెలియజేశాం.వాణిజ్యపన్నుల పంపిణీకి సంబంధించి సెక్షన్ 50,51,56కి సవరణలు తేవాలని అడిగాం,దీనివల్ల రూ.3,820కోట్లు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందనే విషయం గుర్తుచేశాం"

Advertisements

Advertisements

Latest Articles

Most Read