ఇవాళ ఉండవల్లిలో జరిగిన టీడీపీ వర్క్‌షాప్ లో చంద్రబాబు పార్టీ నాయకులని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసారు... చంద్రబాబు మాట్లాడుతూ "ముప్పై నలభై ఏళ్లలో ఎవరూ చేయని పనులు అనేకం చేశాం.వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేశాం.మూడున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం కాబట్టే మీరు గ్రామాలకు వెళ్తే శభాష్ అంటున్నారు.ఈ సంతృప్తిని నిలబెట్టుకోవాలి.దేశంలో ఎన్నిరాష్ట్రాలు ఇన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి? ఎన్నిరాష్ట్రాలు రూ.5లక్షల బీమా ఇస్తున్నాయి?ఎన్ని రాష్ట్రాలు గ్రామగ్రామాన సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాయి?ఎన్నిరాష్ట్రాలు 100% కరెంట్ కనెక్షన్లు,వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాయి?ఎన్ని రాష్ట్రాలు 100%ఓడిఎఫ్ కు వెళ్లున్నాయి? అనేదానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది" అని చంద్రబాబు అన్నారు...

cbn mla 21012018 2

"ప్రజలకు, ప్రతినిధులకు మధ్య ఏమాత్రం దూరం పెరగరాదు... దూరం పెరిగితే ప్రతినిధులకే నష్టం తప్ప ప్రజలకు కాదనేది గుర్తుంచుకోవాలి... కుప్పంలో రాబోయే ఎన్నిక 6వది, 40వేల నుంచి 70వేల మెజారిటీతో ఆదరిస్తున్నారు... రేపు గెలిస్తే అక్కడనుంచి 30 ఏళ్ల ప్రాతినిధ్యం అవుతుంది. ప్రజల్లో నమ్మకం, నాయకత్వ సామర్ధ్యం వల్లే ఇది సాధ్యం అయ్యింది.ఆ స్ఫూర్తిని అన్ని నియోజకవర్గాలలో పెంచాలి... ఫిబ్రవరి నుంచి అందరినీ పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడుతా. పార్లమెంటరీ స్థానంలో 7నియోజకవర్గాలను గెలిపించాల్సిన బాధ్యత పార్లమెంటరీ ఇన్ ఛార్జులదే.ఫోర్ మెంబర్ కమిటీల నివేదికలు రాగానే బలహీన నియోజకవర్గాలపై దృష్టిపెడతా.ఇకపై రాజకీయ కసరత్తుకే ప్రథమ ప్రాధాన్యం..." అని చంద్రబాబు అన్నారు...

cbn mla 21012018 3

"మనలో ఐకమత్యం కావాలి,విబేధాలు తొలగించుకోవాలి,పాత,కొత్త కలయిక పక్కాగా,పకడ్బందీగా జరగాలి. కొన్ని నియోజకవర్గాలు చాలా బాగున్నాయి,చాలా సంతోషం.పేర్లు చెబితే మిగిలిన వాళ్లు డీమోరల్ అవుతారు... రాబోయే ఎన్నికల్లో ఎక్కడన్నా ఎమ్మెల్సీలు కలబడితే సహించను.వారికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ కూడా ఇవ్వను.వ్యక్తిగత ప్రయోజనాలే కాదు,పార్టీ ప్రయోజనాలు కూడా ముఖ్యమనేది అందరూ గుర్తుంచుకోవాలి.మీవల్ల పార్టీకి పదిఓట్లు రావాలే గాని,ఓట్లు పోగొట్టేలా మీ ప్రవర్తన ఉండకూడదు... అన్నీ బాగున్నాయి,సార్ కు ఏమీ తెలియదని కొందరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు.ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తుందనేది గుర్తుంచుకోవాలి." అని చంద్రబాబు అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read