నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతితో పాటు భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసుకునే లక్ష్యంతో నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభం అయ్యింది. ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కార్యాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ ఈ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు... ఈ సందర్బంగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి... ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా తాకాయి...
నీతి అయోగ్ వైస్ చైర్మన్ కలెక్టర్లని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలని శాసించే స్థాయికి త్వరలోనే చేరుకుంటుంది అన్నారు... అంతే కాదు, హైదరాబాద్ లో పన్నులు కట్టేది 40% మంది ఆంధ్రప్రదేశ్ వారే అని చెప్పారు.. ఇంతటితో ఆగలేదు, హైదరాబాద్ లో పన్నులు కట్టే ఆ 40% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరిగి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలే ఉండవు అని అన్నారు... అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మిగతా రాష్ట్రాలకి సాయం చేసే స్థానంలో ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు..
హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రా వారి గురించి, వారు అక్కడ కట్టే పన్నులు గురించి మాట్లాడి ఒక కొత్త చర్చకు దారి తీసారు... నిజానికి ఆయన చెప్పింది వాస్తవం కూడా... ఈ వ్యాఖ్యలతో తెలంగాణాలో కూడా వైబ్రషణ్స్ వస్తున్నాయి.. తెలంగాణాకు గుండెకాయ హైదరాబాద్... హైదరాబాద్ బ్రతుకుందే ఆంధ్రా వారితో అనేది అక్షర సత్యం... ఇక హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తే, ఇక హైదరాబాద్ గురించి చెప్పనవసరం లేదు... అది నిన్న సంక్రాంతి పండుగ రోజున ఖాళీ రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటల్స్, ఇవన్నీ చుస్తే ఆంధ్రా వాళ్ళు ఎంత మంది హైదరాబాద్ ని బ్రతికిస్తున్నారో అర్ధమవుతుంది... నిజంగా రాష్ట్రం మీద ప్రేమ వారు అంతా ఇక్కడకు వచ్చేస్తే అంతకంటే కావలసింది ఏమి ఉంటుంది...