నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దేశ ఆర్ధిక రాజధానికి రేపటి నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది... నవ్యాంధ్రప్రదేశ్ నుంచి దేశ ఆర్థిక రాజధానికి అనుసంధానం, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది... శుక్రవారం నుంచి విమాన సర్వీసు ఆపరేషన్‌ ప్రారంభం కానుంది... ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఈ విమాన సర్వీస్ ప్రారంభిస్తుంది... ఉదయం ఎనిమిది గంటలకు ముంబై నుంచి విమానం బయలుదేరి 9.45 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి 10.30కు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకల్లా ముంబైకి ఈ విమానం చేరుకుంటుంది....

air india 18012018 2

ముంబయికి విమాన సర్వీసును ఏర్పాటు చెయ్యటంతో, వ్యాపార వర్గాలకే కాక, విదేశాలకు వెళ్ళేవారికి కూడా, ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం విదేశాల నుంచి విజయవాడకు వచ్చేవారు, ఎవరైనా హైదరాబాద్‌లోనో లేక, ముంబయిలో దిగి అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుని, విజయవాడకు రావాల్సి వస్తోంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది... గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండి కూడా, ముంబైలో దిగి, మళ్ళీ హైదరాబాద్ వచ్చి, విజయవాడ రావాల్సి వస్తుంది... దీంతో గన్నవరం నుంచి ముంబై కి సర్వీసులను ఏర్పాటు చేయాలంటూ, పౌరవిమానయానశాఖకు ఇక్కడి వ్యాపార సంఘాల నుంచి లేఖలు చాలాకాలంగా రాస్తున్నారు.

air india 18012018 3

దేశంలోనే రెండో అతిపెద్ద రద్దీ ఎయిర్ పోర్ట్ ముంబయి కావడంతో, అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు ఇక్కడి వారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చే అంతర్జాతీయ సర్వీసుల్లో ఎక్కువశాతం అర్థరాత్రి దాటాకే వస్తాయి. అక్కడి నుంచి విజయవాడకు రావాలంటే ఉదయం వరకూ వేచి చూడాల్సిందే. అదే ముంబయికి సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ఈ సమస్య ఉండదు. ఇక ఎయిరిండియా సర్వీసులో ఇక్కడి నుంచి వెళ్లి.. అదే సంస్థ ముంబయి నుంచి విదేశాలకు నడిపే సర్వీసులను అందుకోవచ్చు. టిక్కెట్లను సైతం నేరుగా తీసుకునేందుకు వీలు కుదురుతుంది. దీంతో జపాన్‌, దుబాయ్‌ సహా ఏ దేశానికైనా నేరుగా విజయవాడ నుంచి చేరుకున్నట్టుగానే ఉంటుంది. సమయం వృథా కాకుండా వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read