ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సారి లాగా, ఈ సారి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించింది... భవిష్యత్తు వ్యూహాన్ని, ఎలా పని చెయ్యాలి అనే దిశానిర్దేశం చేయ్యనున్నారు చంద్రబాబు... వివిధ అంశాలపై చంద్రబాబు ఒక ప్రజెంటేషన్‌ను కూడా ఇచ్చారు... రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో కూడిన యంత్రాంగమంతా పాల్గొననుంది. కలెక్టర్ల సదస్సులో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు కూడా పాల్గున్నారు... అయితే, ఈ సారి నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి...
మొదటిది, ఈ సారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కాకుండా, ప్రభుత్వ భావనల్లో నిర్వహించటం... మొన్నటి దాకా సరైన ప్రభుత్వ భావనలు లేక, విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించే వారు... గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు ప్రభుత్వ భావనాల్లో జరగడం ఇదే తొలిసారి... గతంలో హైదరాబాద్ లో జూబ్లి హాలులో కలెక్టర్ల సదస్సుల జరిగేవి... రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులు ప్రైవేటు భవనంలో జరుగుతూ వస్తున్నాయి... ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వం, ప్రభుత్వ భవనాల్లోనే కలెక్టర్ల సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రెండవది, కలెక్టర్ల సదస్సుకు గుంటూరు జిల్లా ప్రప్రథమంగా ఆతిథ్యం ఇచ్చింది... ఇప్ప టివరకు కలెక్టర్ల సదస్సుని విజయవాడలో నిర్వహిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ దఫా అమరావతి రాజధాని నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబ ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసం పక్కనే నూతనంగా నిర్మించిన స్టేట్ గ్రీవెన్స్ సెల్ బిల్డింగ్‌లో ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు... అలాగే ఈ సదస్సుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ కూర్చుని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు వీక్షించవచ్చు... జిల్లాలకు సంబంధించి ఏ అం శాలు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నారు, ఇతర జిల్లాల పనితీరు వంటివి తెలుసుకోవచ్చు.