ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వెళ్ళిన బిల్లు, రాజ్‌భవన్‌ నుంచి రెండు సార్లు వెనక్కు వచ్చింది... గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య ఘాటు లేఖలు కూడా నడిచాయి.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజభవన్‌కు మధ్య దూరం పెరుగుతోంది అనుకుంటున్న టైంలో, ఏమైందో ఏమో తెలీదు కుఆని, చివరకు గంటల్లోనే ఫైల్ మీద సంతకంపెట్టి, గవర్నర్ ఆమోదించారు... అసలు ఏమి జరింగింది అంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన నాలా ఆర్డినెన్స్ బిల్లు పై గవర్నర్ నరసింహన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సార్లు పంపించిన బిల్లుని గవర్నర్ అమెదించక పోవటం పై చంద్రబాబు కూడా గుర్రుగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి... ఈ నాలా బిల్లును వెంటనే ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం పై బీజేపీ శాసనసభాపక్షం నేత విష్ణుకుమార్‌రాజు ఒత్తిడి తెచ్చారు... పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, నాలా పన్ను ఎక్కువగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసారు, దీనిని వెంటనే తగ్గించాలని విష్ణకుమార్ రాజు చంద్రబాబు దగ్గర ఒత్తిడి తెచ్చారు.

governer 18012018 2

గవర్నర్ చూపుతున్న అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పినప్పటికీ గవర్నర్ బిల్లు అమెదించలేదు... దీనిపై విష్ణుకుమార్రాజు ముఖ్యమంత్రిని కలిసి, ఈ విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత విష్ణుకుమార్ రాజు మీడియా ముందు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేసారు. బిల్లును ఆమోదించపోవడం వల్లే మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి నాలుగు నెలల నుంచి తగ్గిపోయింది అని ఆయన మండిపడ్డారు. అయినా కూడా గవర్నర్ నుంచి ఆమోదం రాకపోగా ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాసారు.

governer 18012018 3

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు రంగంలోకి దిగి, మా రాష్ట్రానికి కొత్త గవర్నర్ కావాలని డిమాండ్ చేసారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ను చిన్న చూపు చూస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తామని బీజేపీ నేతలు చెప్పారు... హరిబాబు ఒక అడుగు ముందుకు వేసి, కేంద్రానికి ఫిర్యాదు చేసారు కూడా... దీంతో బీజేపి నేతల దెబ్బ రాజ్‌భవన్‌ను తాకింది.... ఏం జరిగిందో తెలియదు కానీ 24 గంటల్లో గవర్నర్ సంతకం ఫైలు పై పడింది... బీజేపీ వైపు నుంచి నరుక్కొచ్చి తెలుగుదేశం పార్టీ నేతలు పని చక్కబెట్టారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read