పార్లమెంటు సాక్షిగా, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, మన ఎంపీలు, ఆందోళన చేస్తున్నారు... చేస్తాం, చూస్తామంటే సంతృప్తి కలుగదు, ఆ స్థాయి దాటిపోయిందని, హామీలు కాదు, చేతలు కావాలి, స్పష్టమైన కార్యాచరణ కావలంటూ, బీజేపీ బుజ్జగింపులకు లొంగటం లేదు... ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో ప్రతిభంబిస్తున్నారు... హక్కుగా ప్రజల తరపున అడుగుతున్నామని, డిమాండ్‌ను వినిపిస్తున్నామని, మిత్రపక్ష ధర్మంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నామని ఎంపీలు చెప్తున్నారు...
మన ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే అకాళీదళ్ పార్టీ, శివసేన పార్టీ మద్దతు ప్రకటించాయి... తాజాగా, మోడీని మొదటి నుంచి వెంటాడుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మనకు మద్దతు ప్రకటించారు... "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్డీయే ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోవటం లేదు అని, అందుకే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం కూడా, మోడీని వ్యక్తిరేకిస్తుంది" అని మమతా అన్నారు...
"ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండ్ లో న్యాయం ఉంది అని, చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నామని... తెలుగుదేశం పార్టీ ఇంకా గట్టిగా పోరాడాలని, తెలుగుదేశం స్పూర్తితో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీలు, మోడీ చేస్తున్న అన్యాయం పై పోరాడాలని" మమతా అన్నారు... మమతా లాంటి పవర్ఫుల్ లేడీ, కాంగ్రెస్ కంటే ఎక్కువగా మోడీని టార్గెట్ చేస్తున్న దీదీ, చంద్రబాబుకి సప్పోర్ట్ ఇవ్వటంతో, మరో సారి జాతీయ స్థాయిలో చర్చనీయంసం అయ్యింది...మొత్తానికి చంద్రబాబు, ఏ విధంగా అయితే మనకు జరిగిన అన్యాయం పై, దేశ వ్యాప్తంగా సపోర్ట్ కావలి అనుకున్నారో, అలాగే లభిస్తుంది..