మొన్నటిదాకా అమరావతి అంటే నేషనల్ మీడియాకు పెద్దగా తెలియదు... హైదరాబాద్ మీడియానే, మన అమరావతి గుర్తించనప్పుడు, నేషనల్ మీడియా ఎలా గుర్తిస్తుంది అనుకుంటున్నారా... ఏమి చేస్తాం... మన రాష్ట్రంలో జరిగే విషయాలు, అసలు నేషనల్ మీడియాలో కనిపించవు... ఏదన్నా నెగటివ్ న్యూస్ ఉంటే మాత్రం, హైదరాబాద్ నుంచి ఊహించుకుంటూ రిపోర్ట్ చేస్తారు... మన ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని రాష్ట్రపతి పొగిడినా, నీతీ అయోగ్ మెచ్చుకున్నా, మన రాష్ట్రం గురించి నేషనల్ మీడియాలో అసలు వార్త అనేదే రాదు.. అలాంటిది, మొన్న ఆదివారం జరిగిన ఎంపీల సమావేశం కవర్ చెయ్యటానికి, నేషనల్ మీడియా మొత్తం అమరావతిలో వాలిపోయింది...
ఇక్కడ నుంచి, లైవ్ కవరేజ్ లో, దేశం అంతా వెళ్ళాయి... లైవ్ ఫ్రం అమరావతి అని, లైవ్ ఫ్రం ఆంధ్రాస్ న్యూ కాపిటల్ అని, ఇలా నేషనల్ మీడియా కవర్ చేసింది... ఇది చుసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం, చంద్రబాబు పుణ్యమా అని, మన రాష్ట్రాన్ని, మన రాజధానిని ఇప్పటికైనా గుర్తించారు అని సంతోష పడ్డారు... ఇంతటితో అయిపోలేదు... అమరావతి వచ్చిన నేషనల్ చానల్స్ సీనియర్ ఎడిటర్లు, డైరెక్టర్లు అమరావతిని చూసి ఆశ్చర్యపోయారు... తమ అనుభూతులని ట్విట్టర్ లో పంచుకున్నారు...
ఇండియా టుడే ఎడిటర్ ట్వీట్ చేస్తూ, మొదటిసారి అమరావతి వచ్చాను, చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం జరుగుతుంది... నేను ఒక అద్భుతమైన లొకేషన్ లో ఉన్నారు, అమరావతిలో ఉన్నాను, రివర్ ఫ్రంట్ లొకేషన్ లో ఉన్నాను అంటూ ట్వీట్ చేసారు... అలాగే, ఎన్డీటీవీ ఎడిటర్ ట్వీట్ చేస్తూ, వెలగపూడి సచివాలయం టెంపరరీ అయినా, ఎంతో క్లాస్ గా, ప్రోగ్రీసివ్ గా, ఎకో ఫ్రెండ్లీ సైకిల్స్ తో, ప్రాంగణం మొత్తం స్మార్ట్ గా ఉంది... సచివాలయం లోపల రోడ్లు, పరిసరాలు ఎంతో క్లీన్ గా ఉన్నాయి, ఎంతో విశాలంగా, క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రాంగణం ఉంది, మోడరన్ గా ఉంది, సచివాలయం క్యాంటీన్ కూడా ఎంతో బాగుంది అంటూ ట్వీట్ చేసారు... ఇలా ఏనాడైనా, మన హైదరాబాద్ మీడియా మన అమరావతి గురించి రాసిందా... అందుకే అంటారు, మన విజయాలే మాట్లాడాలి అని...