‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి. అన్యాయమైన రీతిలో విభజన చేసి రాష్ట్రాన్ని అనాథగా మిగిల్చారు. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాడు పార్లమెంటులో ఉన్న పార్టీలన్నీ కలిసి ఈ విభజనను ఆమోదించాయి. నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత ఆ పార్టీలన్నిటిపైనా ఉంది... ఇప్పుడు ఇలా చేస్తే ఎవర్నీ వదిలిపెట్టేది లేదు... ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు... మీరు ఎంత ఆందోళన చేస్తే అంత ఆందోళన చెయ్యండి... నేను చెప్తున్నా, ఎంత వరకు అయినా వెళ్ళండి ’ అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు తేల్చిచెప్పారు.

cbn 06022018 2

ముఖ్యమంత్రి ఆగ్రహంతో, ముందుగా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్‌ రంగంలోకి దిగారు... మన ఎంపీలతో నిన్న రాజ్‌నాథ్‌‌సింగ్‌ భేటీ అయ్యి, వారిని సముదాయించే ప్రయత్నం చేసారు.. దీంతో ఎంపీలు కొంచెం గట్టిగానే రాజ్‌నాథ్‌‌సింగ్‌ కు బదులు ఇచ్చారు... ఇక ఈ మాటలు ఎన్నాళ్ళు చెప్తారు, మామ్మల్ని ప్రజలు కొట్టేలాగా ఉన్నారు... ఎదో ఒకటి తేలిస్తేనే, మేము ప్రజల ముందుకు వెళ్ళగలం, మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆడుకోండి అంటూ రాజ్‌నాథ్‌‌సింగ్‌ ఎంపీలు గట్టిగా మాట్లాడారు... మీరు మాటలు చెప్తే, మేము చేతల్లో చూపిస్తాం... పార్లమెంట్ లో ఆందోళన చేసి తీరుతాం.. మీ నుంచి మేము చేతలు కావలి అంటూ, నిర్మొహమాటంగా రాజ్‌నాథ్‌‌సింగ్‌ కి చెప్పారు...

cbn 06022018 3

దీంతో రాజ్‌నాథ్‌‌సింగ్‌ వెంటనే ప్రధానితో మాట్లాడుతానని, మనం ప్రధాని దగ్గరకు వెళ్దాం రాజ్‌నాథ్‌‌సింగ్‌ ఎంపీలతో చెప్పారు.. చెప్పినట్టుగానే, ఉదయం ప్రధాని కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ వచ్చింది... మన నిరసన పై ప్రధాని వైపు నుంచి ఇదే ఫస్ట్ రియాక్షన్... ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని టీడీపీ ఎంపీలు కలవాల్సిందిగా కబురు వచ్చింది. భేటీలో ఏపీకి రావాల్సిన నిధులతోపాటు పలు అంశాలపై చర్చించే అవకాశముంది. నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చల తర్వాత ప్రధాని నుంచి పిలుపువచ్చినట్లు ఎంపీలు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు... దీంతో చంద్రబాబు కూడా దిశానిర్దేసం చేసారు... రాజ్‌నాథ్‌‌సింగ్‌ తో ఎలా మాట్లాడారో, ప్రధానితో కూడా అంతే గట్టిగా ఉండండి... ప్రధాని అపాయింట్మెంట్ ఉన్నా సరే, మీరు ఆందోళన విరమించవద్దు.. సభ వాయిదా పడితే, పార్లమెంట్ బయట నిరసన తెలపండి... ప్రజల ఆక్రోశం వినిపించండి... నిన్న కొంత మంది ఎంపీలు ఆందోళనకు రాలేదు, ఈ రోజు ప్రతి ఒక్కరు ఆందోళన చెయ్యండి... ప్రజలు మీ చర్యలు చూస్తున్నారు.. ప్రతిపక్షం నిద్రపోతుంది, మన ప్రజల గురించి మనమే, గొంతు వినిపించాలి అంటూ, ఎంపీలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read