జలవనరులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరుదైన ఘనతను సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 53 శాతం పూర్తయ్యిందని, కుడి ప్రధాన కాలువ 91%, ఎడమ ప్రధాన కాలువ 60% నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

polavarm 05022018 2

హెడ్ వర్క్స్ 39% పూర్తికాగా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 66% అయ్యిందని తెలిపారు. 71% వరకు స్పిల్‌వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14% మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయ్యిందని చెప్పారు. అలాగే 82 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు, 5,314 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు, 18.8 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ వారం రోజుల్లో చేపట్టినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ. 12,915.38 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు చేసిన మొత్తం రూ. 7,779.52 కోట్లుగా చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ మొత్తంలో గతేడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం రాష్ట్రానికి రూ. 4,329.06 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

polavarm 05022018 3

వరద మళ్లింపునకు సంబంధించి స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్ల ఏర్పాటు, డయాఫ్రమ్ వాల్ తదితర పనులకు రూ. 4,375.73 కోట్లు వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. 2019 కల్లా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే రూ. 1,531.53 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ. 2,844.20 కోట్లు అవసరం వుందని ముఖ్యమంత్రికి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా మూడున్నరేళ్ల నుంచి అహోరాత్రులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు అభినందించారు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా ప్రతి సోమవారం పోలవరం నిర్మాణం పురోగతిని పరిశీలిస్తూ, పనులను పర్యవేక్షిస్తూ, యంత్రాంగాన్ని నిర్దేశిస్తూ ప్రాజెక్టుపై తన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చాటుకున్నారని కొనియాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read