ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని కార్యాలయం పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు... మంగళవారం తెలుగుదేశం పార్టీ సమన్వయక మిటీ సమావేశంలో, పార్లమెంట్ లో జరిగుతున్న పరిణామాల పై చర్చిస్తూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు... పీఎంవో కారిడార్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి తిరుగతూ.. దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు... పీఎంవో పరిసరాల్లోకి విజయసాయి రెడ్డి వారిని అనుమతించొద్దని అన్నారు. విజయసాయి రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇస్తే పీఎంవోకే కళంకమని సీఎం అన్నారు....
మరో పక్క వైసీపీ తీరు పై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు... కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే..వైసీపీ ఏమో కేంద్రానికి దగ్గర అవుతూ టీడీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందంటూ మండిపడ్డారు. మరోవైపు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.. ఓ వైపు బడ్జెట్ బాగుందని కేంద్రాన్ని పొగుడుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనడం వైసీపీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.
పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు పంపుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్‌కు కూడా ఫిర్యాదులు పంపుతూ అక్కడ్నుంచి వచ్చే రుణాలను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో వైసీపీ తీరును ఎండగట్టాలని, అలాగే ఈ పరిస్థితులను అధిగమించి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా టీడీపీ ఎంపీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.