45 రోజుల సుదీర్ఘ బస్సు యాత్ర అంటూ, మొదలు పెట్టిన పవన్, శ్రీకాకుళంలో బౌన్సర్లకు దెబ్బలు తగిలాయని రెండు రోజులు, వారి స్థానంలో కొత్త వారు రావాలని, వారి గాయాలు తగ్గాలని, ఇలా మూడు రోజులు రిసార్ట్ కి పరిమితం అయ్యారు.. ఒక రోజు రిసార్ట్ దీక్ష చేసారు. ఇక విజయనగరం వచ్చి, రెండు రోజులు తిరిగి, పోయిన శనివారం అరకు రిసార్ట్ కి వెళ్లి, గురువారం బయటకు వచ్చారు. మళ్ళీ ఈ రోజు సెలవు ప్రకటించారు. కారణం తెలియదు. ఇలా, దాదాపు 10 రోజుల పైనే సెలవులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా యాత్ర వాయిదా వేసుకుని హైదరబాద్ వెళ్ళిపోతున్నారు. ఈ సారి కూడా కారణం బౌన్సర్లే, పవాన్ కళ్యాణ్ మాత్రం చాలా ఫిట్ గా ఉన్నారు. చంద్రబాబుని రిటైర్మెంట్ తీసుకోమంతున్ను, పవన్ ఆపసోపాలు ఇవి..
చంద్రబాబు ముసలాడు అయిపోయాడు అంటూ, 18 గంటలు 24/7 కష్టపడుతున్న పవన్ కళ్యాణ్, చేస్తున్న విన్యాసాలు ఇవి. ఒకరిని వెటకారం చేసేప్పుడు, మనం కూడా మనుషులమే, మనకీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులు గుర్తుంచుకోవాలి. ఇక పొతే పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ ప్రకారం, ఇవి వివారాలు.. ఇది చదివే ముందు, పవన్ కళ్యాణ్ చాలా ఫిట్ గా ఉన్నారు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి.. కేవలం బౌన్సర్ల కోసమే, ఈ త్యాగం. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉన్నందున రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ విరామాన్ని ప్రకటించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
రంజాన్ పండుగ అనంతరం జనసేన పోరాట యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. ఎల్లుండి సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖ నుంచి హైదరాబాద్ కు పయనమవుతారని తెలిపింది. ఈ రెండు రోజులు పవన్ కళ్యాణ్ విశాఖలోనే మేధావులతో చర్చులు జరుపుతారని తెలిపింది. అదే మొన్న జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే సమావేశం, దాని తరువాత ఏమైందో అలాగ అనమాట.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సమస్యల పై అవిశ్రాంత పోరాటం చేసిన పవన్, బౌన్సర్ల కోసం, ఆయన సొంత రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం అయిన హైదరాబాద్ పయనం అవుతారు. అక్కడ కెసిఆర్ ని ఆకాశానికి ఎత్తి, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో మన రాష్ట్రానికి వచ్చి, యధావిధిగా అమరావతి పై విషం చిమ్ముతూ, చంద్రబాబు పై విమర్శలు చేస్తారు. మోడీని, జగన్ ని మాత్రం ఒక్క మాట కూడా అనరు. ఈ విప్లవ నాయుకుడి పోరాటం కోసం మళ్ళీ, రంజాన్ పండుగ అయ్యేదాకా ఆగాల్సిందే...