అందరూ ప్రకటనలు మాత్రమే ఇస్తారు.. చంద్రబాబు చేసి చూపిస్తారు అనే దానికి, ఇదే ఒక ఉదాహరణ... డీఎస్సీ ప్రకటన రాగానే, ఇది ప్రకటనల వరుకే అంటూ, కొంత మంది ఎద్దేవా చేసారు... కాని చంద్రబాబు మాత్రం, ఒక పధ్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ-2018 పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. . ఈసారి పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పజెప్పినట్లు చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం రాగానే ఏపీపీఎస్సీ అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయన్నారు.పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పించడానికి వీలుగా ఆయా పోస్టులను తొలిసారిగా భర్తీచేస్తున్నట్లు గుర్తుచేశారు.

ఈసారి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించి ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావాన్ని తెలియజేసేలా ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. జూలై ఆరు నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై ఏడో తేదీ నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 15 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 24, 25, 26 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయి. ఆగస్టు 27న ప్రాథమిక కీ విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబరు ఏడో తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 10న తుది కీ, 15న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,061, లాంగ్వేజ్‌ పండిట్లు 251, పీఈటీలు 24, ఎస్జీటీలు 2,290, మునిసిపల్‌ పోస్టులు 1,448, మోడల్‌ స్కూల్‌ టీచర్లు 929, సంగీతం 58, కొత్తగా ఏర్పాటుచేసినవి 3,290 పోస్టులు భర్తీ చేయనున్నారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014లో పదివేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, వర్చువల్‌ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం లేదన్నారు. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి 90శాతం పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంటర్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్నారు. మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read