జగన్, పవన్, బీజేపీతో పాటు, ముద్రగడ, మోత్కుపల్లి, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, చంద్రబాబు మీద దాడి ఎలా జరుగుతుందో చూస్తున్నాం. కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, రాష్ట్రానికి రావాల్సిన హక్కు గురించి అడిగినా, వాళ్ళ ఇగో దెబ్బతిని, బీజేపీ చేస్తున్న పనులు చూస్తున్నాం. జగన్ ని కేసులుతో లోబర్చుకుని, పవన్ ను కూడా లైన్ లో పెట్టి, బీజేపీ, చంద్రబాబు పై దాడి చేస్తుంది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు చూస్తుంటే, వినపడుతున్నవి అన్నీ పుకార్లు కాదని, నిజమే అని అర్ధమవుతుంది. మన రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా, బీజేపీ ఎలా గొంతు కొస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు, మోడీ లాంటి బలమైన నేతను డీ కొడుతుంటే, పవన్, జగన్ మాత్రం, మోడీని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్గా చేసుకునే పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. కుదిరితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశతో పవన్ కల్యాణ్ ఉన్నందున అధికారపక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా విమర్శలు చేయవలసి ఉంటుంది. జగన్మోహన్రెడ్డి కంటే తానే మెరుగైన ప్రత్యామ్నాయం అని రుజువు చేసుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నించాలి, కాని ఇక్కడ అదేమీ కనిపించటం లేదు. మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని, ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ పడే ఆరాటాన్ని విమర్శించిన పవన్, ఇప్పుడు మాత్రం, అసలు ఆ ప్రస్తావనే తేవటం లేదు సరి కదా, తాను కూడా జగన్ లాగే, ముఖ్యమంత్రి అయిపోతున్నాను అని, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు వస్తున్నాయి అంటూ ప్రకటనను చేస్తున్నారు.
అయితే దీని వెనుక, బీజేపీ హస్తం చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరినీ కోఆర్డినేట్ చేస్తున్న బీజేపీ, ఇద్దిరినీ అవగాహనతో కలిసి పని చెయ్యమని చెప్పినట్టు తెలుస్తుంది. దీని కోసం, వైసీపీ ఎంపీ వరప్రసాద్ రంగంలోకి దిగారని, జగన్, పవన్ మధ్య, సయోధ్య కుదిరించారని సమాచారం. ఇందులో భాగంగానే, ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చారు. మీ జోలికి నేను రాను – నా జోలికి మీరు రావద్దు, అలాగే బీజేపీ జోలికి వెళ్ళద్దు, అందరం కలిసి చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేద్దాం అనే అవగాహనకు వచ్చారు. అందులో భాగంగానే, జగన్, పవన్ నోటి వెంట, చంద్రబాబు నామస్మరణ తప్ప వేరే పేరు రావటం లేదు. అలాగే, పవన్, జగన్ కలిసి పని చేసే అవకాసం కూడా లేకపోలేదని అంటున్నారు. ఎవరికి వారు పోటీ చేస్తే అది చంద్రబాబుకి చాలా ఈజీ గెలుపు అయిపోతుంది అని, అందుకే కలిసి పోటీ చెయ్యాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అందరూ కలిసి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని దింపటం కోసం, చాలా శ్రమ పడుతున్నారు.