ఇప్పటి వరకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక ప్లస్, అవినీతి అనేది బయటకు కనిపించక పోవటం... బయట పడినా, మీడియాలో ప్రముఖంగా రాకపోవటం... అయితే, ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం బయట పడింది... వీరు బయటకు కనిపించే అంత క్లీన్ కాదని, పాపం పండిన రోజు, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువ చేసిన స్కాంలు బయట పడతాయని అర్ధమవుతుంది. పెద్ద నోట్ల రద్దు, అమిత్ షా పాలిట వరంగా మారిందని, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా బయట పెట్టిన సమాచారం ధ్రువీకరిస్తుంది. అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ జిల్లా సహకార బ్యాంకు రద్దయిన నోట్లను జమ చేసుకున్న వ్యవహారంలో అగ్రస్థానంలో నిల్చింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు రేగాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను స్వీకరించినట్లు తాజాగా వెల్లడయ్యింది.

amitshah 22062018 2

ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ అనే సమాచార హక్కు ఓ పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలని సూచించారు. అంతే ఆ మాటున పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్‌ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్‌ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్‌ జరిగింది. రాజ్‌కోట్‌ నుంచే మోదీ 2001లో మొట్టమొదట గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్‌ అయిన జయేశ్‌భాయ్‌ విఠల్‌భాయ్‌ రదాదియా ప్రస్తుతం విజయ్‌ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌ డీసీసీబీకి అమిత్‌ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.

amitshah 22062018 3

డీసీసీబీల ద్వారా నల్లధనాన్ని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి డీసీసీబీలను నవంబరు 14న అంటే ఐదు రోజుల తరువాత తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయల మేర జమ అయిపోయాయి. అలా జమ చేసిన నోట్లకు సంబంధించిన వారిపై నేటిదాకా ఎలాంటి విచారణా జరగలేదని ఆర్టీఐ కార్యకర్త వివరించారు. అహ్మదాబాద్‌ డీసీసీబీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం 2017 మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ 5050 కోట్లు.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ 14.31 కోట్లు. విశేషమేమంటే గుజరాత్‌ రాష్ట్ర సహకార బ్యాంకు (ఎస్‌సీబీ) కంటే అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ల్లో డిపాజిట్లు అనేక రెట్లు ఎక్కువ. ఎస్సీబీలో డిపాజిట్లు రూ 1.11 కోట్లు మాత్రమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read