త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో, జగన, కేసీఆర్ మద్దతును బీజేపీ అధినాయకత్వం కోరుతున్నట్టు గత కొన్ని రోజులగా సమాచారం వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో తక్కువ మెజారిటీ ఉండటంతో, బీజేపీ నానా పాట్లు పడుతుంది. తెలుగుదేశం దూరం జరగటంతో, ఇప్పుడు బీజేపీ అల్లాడిపోతుంది. అయితే, తెలుగుదేశం లేని లోటు, జగన్, కెసిఆర్ తో తీర్చుకుంటానికి సిద్ధం అయ్యింది. అయితే, ఇదే చనువుగా తీసుకుని, ఇదే మంచి అవకాసం అనుకుని, అమిత్ షా తో బేరాలు మొదలు పెట్టాడు జగన్. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ పదవికి, ఎన్డీఏ అభ్యర్ధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తే బాగుంటుంది అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే, కొన్ని ఏళ్ళ పాటు, కోర్ట్ ల్లో కేసులు నుంచి తప్పించుకోవచ్చని జగన్ ఆలోచన..
అయుతే ఈ ప్రతిపాదనని చాలా సీరియస్ గా, అమిత్ షా తిప్పికోట్టినట్టు తెలుస్తుంది. అంత అత్యున్నత పదవి, విజయసాయి రెడ్డిలాగా కేసులు ఉన్న వ్యక్తికి ఇవ్వటం కుదరదు అని, వెంకయ్య తరువాత స్థానం, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తికి ఎలా ఇస్తారని, ఈ ఆలోచన మర్చిపోయి, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అమిత్ షా హుకం జారీ చేసారు. చేసేది ఏమి లేక, ఏ అభ్యర్ధిని నిలబెట్టినా, పూర్తి మద్దతు ఇస్తాము అని జగన్ చెప్పినట్టు, లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. మరో పక్క, కెసిఆర్ కూడా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ పదవి కేశవరావుకు ఇవ్వాలని అమిత్ షా ని కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే, కెసిఆర్ ప్రతిపాదాన్ని కూడా, అమిత్ షా తిరస్కరించినట్టు తెలుస్తుంది.
ఈ నెలాఖరుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ పదవీ కాలం ముగియనుండగా, ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిగా ఎవరిని నిలపాలన్న విషయమై గత కొంత కాలంగా సమాలోచనలు చేస్తున్న బీజేపీ, చివరకు మిత్రపక్షమైన శివసేనకు ఆ పదవిని ఇవ్వాలని అమిత్ షా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో పక్క శివసేన మాత్రం, ప్రతి రోజు బీజేపీని తిడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులుండగా, ఎన్డీయేకు 111 మంది సభ్యులే ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 122. ఇక టీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు ఎంపీలుండగా, జగన్ పార్టీకి రెండు ఎంపీలు ఉన్నారు. వారు ఇటొస్తే గెలుపు సులువవుతుందని నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులు వ్యూహాలు రచిస్తున్నారు.