బీజేపీ జాతీయా అధ్యక్షుడు అమిత్ షా పై, అన్ని జాతీయ వార్తా సంస్థలు ఒక వ్యతిరేక వార్తా రాసాయి. అయితే, పది అంటే పది నిమషాల్లో, ఆ వార్తను వాళ్ళ వెబ్ పోర్టల్ నుంచి డిలీట్ చేసాయి, ప్రముఖ జాతీయ వార్తా సంస్థలు. ఈ పరిణామాల పై ప్రజలు మండి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా, అప్పట్లో, సోనియా గాంధీ పై ఏమన్నా వ్యతిరేక వార్తలు వస్తే, ఇలాగే బెదిరించి వార్తలు తీపించే వారని, ఇప్పుడు అమిత్ షా కూడా అలాగే చేస్తున్నారని, మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అది తప్పు అని, ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు నొక్కుతున్నారని గగ్గోలు పెట్టిన బీజేపీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, అలాంటి పనులే మళ్ళీ రిపీట్ చేస్తుంటే, ఇద్దరికీ తేడా ఏంటి అని అంటున్నారు. ఇలా జాతీయ మీడియాను బెదిరించో, మరొక కారణంతోనే, వ్యతిరేక వార్తలు తీపిస్తున్న అమిత్ షా పై ప్రజలు మండి పడుతున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే, పెద్ద నోట్ల రద్దు, అమిత్ షా పాలిట వరంగా మారిందని, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా బయట పెట్టిన సమాచారం ధ్రువీకరిస్తుంది. అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ జిల్లా సహకార బ్యాంకు రద్దయిన నోట్లను జమ చేసుకున్న వ్యవహారంలో అగ్రస్థానంలో నిల్చింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆ బ్యాంకు లాభదాయకంగా మలుచుకున్నట్లు ఆరోపణలు రేగాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోని రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధిక మొత్తంలో రద్దయిన నోట్లను స్వీకరించినట్లు తాజాగా వెల్లడయ్యింది. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే సమాచార హక్కు ఓ పిటిషన్ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016 నవంబరు 8న ఆకస్మిక ప్రకటన చేశారు.
ప్రజలు తమ వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సూచించారు. అంతే ఆ మాటున పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరడం మొదలెట్టాయి. ఆ క్రమంలో అహ్మదాబాద్ డీసీసీబీకి కేవలం ఐదు రోజుల్లో అంటే నవంబరు 13 సాయంత్రానికి రూ 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమ అయ్యాయి. అటు రాజ్‌కోట్ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. రాజ్‌కోట్ నుంచే మోదీ 2001లో మొట్టమొదట గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి డీసీసీబీకి చైర్మన్ అయిన జయేశ్‌భాయ్ విఠల్‌భాయ్ రదాదియా ప్రస్తుతం విజయ్ రూపానీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్ డీసీసీబీకి అమిత్ షా 2000లో ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.