దేశం చూస్తుండగా షేక్ హ్యాండ్ ఇస్తే అది నీతి ఆయోగ్... దొడ్డిదారిన పీఎంవోలో దూరి మీడియాను చూసి పారిపోతే అది అవినీతి ఆయోగ్... ఇలాంటి పనులు చేసే వైసీపీ, దాని అవినీతి చెంచా సాక్షి కలిసి, నిన్నటి నుంచి, చంద్రబాబు, ప్రధానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు అని, లొంగిపోయారు అని, ఇలా ఇష్టం వచ్చినట్టు కూస్తున్నారు. ఇంకో పిల్ల పార్టీ అయితే, వాళ్ళ నాయకుడు కనీసం ఆంధ్రా వీధుల్లో మోడీ అనే పేరు తలవటానికి కూడా భయపడుతూ నాలుగు రోజులు తిరిగి, ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడు.. వీళ్ళందరూ, కలిసి, దేశం మొత్తం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులకు, ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తే, ఆ సందర్భంలో చంద్రబాబు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఎదో ఒంగిపోయాడు అని, లొంగిపోయాడు అని, పిచ్చ ప్రచారాలు ఎందుకు ? నిజానికి, నీతి అయోగ్ సమావేశానికి ముందు, ఏమి జరిగిందో టీవీల్లో అందరూ చూసారు. మోడీ అక్కడ ఉన్నా, చంద్రబాబు పలకరించకుండా వెళ్ళిపోయారు. టీ బ్రేక్ సమయంలో, ప్రధాని మోడీ, అందరి ముఖ్యమంత్రులని పలకరిస్తూ, మమత, చంద్రబాబు, కుమారస్వామి దగ్గరకు వచ్చి, వీరిని కూడా పలకరించారు. అంటే ప్రధాని అందరి ముఖ్యమంత్రుల దగ్గరకు వచ్చి పలకరిచ్చారు అంటే, ఆయనకు ముఖ్యమంత్రులు అంటే భయం అనుకోవాలా ? ఇలా అంటే, ఎంత చండాలంగా ఉంటుందో, చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇస్తే, లొంగిపోయాడు అనటం కూడా అంతే చండాలంగా ఉంటుంది.

modi 18062018 2

ఒక ముఖ్యమంత్రి, ప్రధానిని కలిస్తే, చొక్కాలు చించేసి కొట్టుకోవాలా ? రాజకీయంగా ఎన్ని వైరాలు ఉన్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఒక ప్రధాని స్థాయిలో వ్యక్తి వచ్చి పలకరిస్తే, దానికి ముఖ్యమంత్రి స్పందిస్తే, అది కూడా తప్పా ? ఒక్క ఫోటో పట్టుకుని, లొంగిపోయాడు అని వాగే సైకోలకి, నిన్న చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని దులిపిన దులుపుడు కనిపించదు. మా రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు, ప్రధానిని నిలదీస్తే, ఇది కనిపించదు.. చంద్రబాబు ఉతుకుడు తట్టుకోలేక, ఇంకా ఆపెయ్యండి, మీ టైం అయిపొయింది అని హోం మంత్రి అంటే, లేదు నేను చెప్పాలి అంటూ, 21 నిమషాలు, 5 కోట్ల మంది ఆకాంక్షను, ఈ దేశ ప్రధాని ముందు, 29 రాష్ట్రాల ముందు వినిపిస్తే, అది కనిపించదు... చివరకు ఇంత వైరం నడుస్తున్నా, వ్యవసాయనికి, ఉపాధి హామీ అనుసంధానం పై అధ్యయనం చేయ్యమని మన ముఖ్యమంత్రిని, ప్రధాని కోరారు... దేశంలో అన్ని రాష్ట్రాలు, విద్యుత్ రంగం విషయంలో, ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకోమన్నారు, ప్రధాని... ఇలాంటివి ఈ సైకోలకు కనిపించవు...

modi 18062018 3

ఇదే సైకోలు, సైకో ఛానల్, మొన్న తిరుమల వచ్చినప్పుడు, అమిత్ షా కు నిరసన తెలిపితే, ఇది ఘోరం, అమానుషం, జాతీయ పార్టీ ప్రెసిడెంట్ కు గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్ పాటించాలి అంటూ కబురులు చెప్పారు. నిరసన తెలిపితీనే ఘోరం, అమానుషం అంటారు.. ఏ సంబంధం లేని జగన్ కూడా, అమిత్ షా కి ఎందుకు నిరసన తెలిపారు అంటూ అడుగుతాడు.. అదే ప్రధానికి షేక్ హ్యాండ్ ఇస్తే, లొంగిపోయాడు అంటారు.. అసలు, మీ మోఖాలకి ఒక క్లారిటీ ఏడ్చిందా ? జగన్-చంద్రబాబుకు, చంద్రబాబు - పవన్ కు ఎలాంటి వైరం ఉందో తెలిసిందే.. వీరు ఎదురు పడితే, చంద్రబాబుని ముఖ్యమంత్రి హోదాలో, పలకరించరా ? షేక్ హ్యాండ్ ఇవ్వరా ? ఎన్ని సార్లు, జగన్, పవన్, చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ? అంటే వారు చంద్రబాబు ఉన్నప్పుడు ఒకలా, చంద్రబాబు ఎదురుగా ఉంటే ఒకలా, ఉంటారని, చంద్రబాబుని చూస్తే భయపడతారు అంటే కుదురుతుందా ? నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబుని కలిసినప్పుడు ? చంద్రబాబు అంటే, భయం ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చాడా ? అది ఆ పదవికి ఉండే గౌరవం.. ఎన్ని అనుకున్నా, ప్రధాని స్థాయి వ్యక్తి ఎదురుపడితే, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, చొక్కాలు చించి, తలకాయి పగలగొట్టి రావాలా ? అయినా, ఎవడి కాళ్ళు కనిపిస్తే, వాళ్ళ కాళ్ళ మీద పడే జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ఇలాంటివి చెప్తే, భలే కామెడీగా ఉంటుంది... చివరగా, ఇలాంటివి అందరి రాజాకీయ నేతలకు ఎదురు అవుతూనే ఉంటాయి... ఇలాంటి వాటి మీద ఎక్కువగా లాగితే, నీవు నేర్పిన విద్యే అంటూ, చివరకు మీ నాయకులకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుంది... జీవితం ఎవ్వరినీ వదలదు.. అందరి సరదా తీర్చేస్తుంది.. టైం రావాలి అంతే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read