అధికార మదం అంటే ఇదే... నా చేతిలో అధికారం ఉంటే, నిన్ను ఎన్ని అయినా అంటాడు, నీ బాధని వెటకారం చేస్తాను, హేళన చేస్తాను అంటూ, గత సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం... బాధ్యత, భయం అనేది లేకుండా, అధికార మదంతో బ్రతికేస్తారు... ఈ విషయంలో, మన బీజేపీ నాయకులు, నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.. 2 సీట్లు నుంచి, ఇక్కడ వరకు వచ్చిన బీజేపీ, గతాన్ని మర్చిపోయి, చంద్రబాబు లాంటి నాయకుడుని, 13 జిల్లాల నాయకుడికి, ఒక జాతీయ పార్టీ సమాధానం చెప్తుందా అంటూ హేళన చెయ్యటం చూసాం.. మీ మోఖాలకి, పెద్ద రాజాధాని కావాలా ? మయసభ కట్టుకుంటారా, అంటూ అమరావతి పై హేళన చెయ్యటం చూసాం.. విభజన హామీలు కోసం పోరాటం చేస్తుంటే, మీకు 85 శాతం అన్ని హామీలు ఇచ్చేసాం, లక్షల కోట్లు ఇచ్చాం అంటూ, మాట్లాడటం చూస్తున్నాం... ఇవన్నీ అధికార మదంతో మాట్లడే మాటలే...

piyush 18062018 2

ఇప్పుడు రైల్వే మంత్రి గారు, మరో అడుగు ముందుకు వేసి, మన బాధను ఎంత వెటకారంగా మాట్లాడారో తెలుసా.... ఈ రోజు, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రెస్ మీట్ పెట్టారు. తన శాఖ గురించి, ఎదో చెప్పుకున్నారు. మన ఆంధ్రా విలేకరులు, విశాఖ రైల్వే జోన్‌ గురించి ప్రస్తావించగా చాలా వెటకారంగా సమాధానం చెప్పారు. "ఆసలు మీకు విభజన చట్టంలో ఏముందో తెలుసా ? విశాఖ రైల్వే జోన్‌ పై పరిశీలన చెయ్యమన్నారు. అందుకే పరిశీలన చేస్తూనే ఉన్నాం. ఇదే విషయాన్ని పరిశీలిస్తూనే ఉంటామని, పార్లమెంట్‌లోకూడా చెప్పామని" చెప్పారు. అంటే గత నాలుగేళ్ళుగా పరిశీలిస్తూనే ఉన్నారు... ఎన్ని ఏళ్ళు అయినా పరిశీలిస్తూనే ఉంటాం.. మీరు మళ్ళీ మళ్ళీ అడగకండి, చట్టంలో పరిశీలించమని ఉంది కాబట్టి, మేము పరిశీలిస్తూనే ఉంటాం అంటూ, పియూష్ గోయల్ వెటకారంగా సమాధానం చెప్తూ, 5 కోట్ల ఆంధ్రులని అవమాన పరిచారు.

piyush 18062018 3

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే జోన్‌ అంశంపై ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఒడిషా రాష్ట్రం ఒప్పుకోలేదంటూ మొదట కేంద్రం మెలికపెట్టింది. అయితే విశాఖ పరిధి వరకు జోన్ ఇస్తే అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం చెప్పింది. ఇందుకు ఏపీ కూడా సమ్మతించింది. అప్పటి నుంచి ఇదిగో ఇస్తున్నాం.. అధిగో అంటూ ఇస్తున్నాం అంటూ బీజేపీ నేతలు చెప్పకుంటూ వస్తున్నారు. తాజా పీయూష్ గోయల్ ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గారు అధికార మదంతో చెప్పినట్టు, చట్టంలో పరిశీలించమని ఉంది కాబట్టి, పరిశీలిస్తూనే ఉంటారనమాట...

Advertisements

Advertisements

Latest Articles

Most Read