ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న అన్యాయం పై, కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశం పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు వచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతోపాటు వెనుకబడిన ప్రాంతాల కోసం రాష్ట్ర అకౌంట్‌లో 350 కోట్లు నిధులు వేసి, వెంటనే కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకోవడాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇవన్నీ విన్న హైకోర్ట్, దీనిపై విచారించిన ధర్మాసనం.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపింది.
విభజన హామీల్లో మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, ఇచ్చిన కొంచెం కూడా వెనక్కి తీసుకుంటున్నారు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు... ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... ఇదే విషయం పై, ఎన్ని సార్లు నిలదీసిన, ఇప్పటి వరకు కేంద్రం, ఆ డబ్బులు ఎందుకు వెనక్కు తీసుకొందో, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ని సార్లు అడిగినా కేంద్రం సమాధానం చెప్పటం లేదు.
మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.