ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఉంటాయని, మళ్లీ ఈ నెల 22న పాఠశాలలు యథావిథిగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ సెలవుల్లో ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లన్నీ కచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

schools 18062018 2

ఇంకా ఎండకాలంలో ఉన్నామేమో అన్పించేలా ఎండలు మాడ్చేస్తున్నాయనే చెప్పాలి. రుతుపవనాలు వచ్చేసి నాలుగురోజులు తొలకరి పలకరించి వెళ్లిపోగా ఆతర్వాత మళ్లీ రోహిణీకార్తె వచ్చిందేమో అన్నట్లుగా భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మరోసారి వెనక్కి తిరిగి వచ్చేశాయి. గత మూడు,నాలుగురోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ దానికితోడు వడగాల్పులు కూడా జతగా రావటంతో జనం అంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వీటికిమించి వడగాలులు తమ ప్రతాపాన్ని పూర్తిస్ధాయిలో ప్రదర్శిస్తున్నాయి. దీంతో సహజంగానే జనం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వడగాలుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆదివారంనాటి పరిణామంలో పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలోనే వడగాలుల ప్రభావానికి గురై చికిత్స పొందుతున్నవారు ఉన్నారు.

schools 18062018 3

ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగిపోతుందని అనుమానిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చేరినవారు అధికశాతం మంది కూలీనాలి చేసుకుంటున్నవారే. మిగిలిన వర్గాల్లో ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికసంఖ్యలోనే చేరిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈపరిస్దితి మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అటు పిల్లల ఆసుపత్రులు, ఇటు సాధారణ అసుపత్రులు కూడా వడగాలుల ప్రభావానికి గురైనవారితో కిటకిటలాడిపోతున్నాయి. సిలైన్ల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తంగా చూస్తే గత నాలుగు రోజులుగా 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నమోదవుతూ వచ్చి ఆదివారంనాటికి 42కు చేరిపోయింది. తొలకరి వర్షాలు కురిసిన తర్వాత కూడా ఈస్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావటం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని పలువురు పేర్కొంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read