ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ ను, అమరావతి రమ్మని ప్రభుత్వం కబురు పంపించింది... ఒకటి రెండు సార్లు.. కాని జగన్ మాత్రం నేను రాను అని కబురు పంపించారు... "అమరావతి శంకుస్థాపనకే రాని వాడు, ఇలాంటి వాటి కోసం ఎందుకు వస్తాడులే అండి, పిలావాల్సిన బాధ్యత మనది, పిలిచాం... మొహమాటం లేకుండా, నేను రాను అని చెప్పాడు... అయినా ఇది ఎమన్నా మన ఇంట్లో వ్యవహారమా, రాష్ట్రానికి సంబంధించింది, ఆయన ఎప్పుడో ప్రతిపక్ష నేత బాధ్యత నుంచి తప్పుకున్నాడు, ఇప్పుడు ఆయన వస్తాడు అని ఎవరు అనుకోవట్లేదు అంటూ", ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు... అసలు జగన్ ను ఎందుకు అమరావతి రావలాని ప్రభుత్వం ఆహ్వానించింది అంటే ? ఇప్పుడు మూడో సారి, కబురు పంపారు..
సమాచార కమిషనర్ల ఎంపిక పై ఇవాళ మధ్యాహ్నం త్రిసభ్య కమిటీ భేటీ కానుండి. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ సమావేశానికి హాజరుకాలేనని వైఎస్ జగన్ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జగన్ హాజరు కాక పోవడంతో జాప్యం అవుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. కాగా ప్రతిపక్ష నేత రాకుంటే ఆర్టీఐ కమిషనర్ల ఎంపికను ఏ విధంగా జరపాలన్న అంశంపై సర్కారు న్యాయ సలహా తీసుకోనుంది.
చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు... ప్రతి శుక్రవారం కోర్ట్ కి ఎలా వెళ్తున్నాడో, అలాగే అమరావతి వచ్చి వెళ్ళటానికి జగన్ కు ఇబ్బంది ఏంటో మరి... రాజిమండ్రిలో ఫ్లైట్ ఎక్కితే, అరగంటలో అమరావతిలో ఉంటాడు.. కాని, జగన్ మాత్రం నాకు అది అనవసరం అన్నట్టు వ్యవహిరించటంతో, ప్రభుత్వం తాను ఇష్టం వచ్చిన వాళ్ళని సమాచార కమిషనర్లగా ఎంపిక చేసుకుంటుంది... అప్పుడు మాత్రం, విమర్శలు చెయ్యటానికి ముందు ఉంటారు...