చంద్రబాబు అంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కు ఎంత వ్యతిరేకతో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ పని చేసిన ఒంటి కాలు మీద వెళ్లి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారి లిస్టు తీస్తే, ఉండవల్లి టాప్ 5 లో ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు పై విరుచుకు పడే ఉండవల్లి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, చంద్రనాబుని నాలుగు తిట్లు తిట్టి, జగన్ ని ఆకాశానికి ఎత్తి, ప్రెస్ మీట్ ముగిస్తారు. జగన్ కు అనుకూలంగా రాజకీయ ప్రసంగాలు చేస్తారు అనేది బహిరంగ రహస్యం. అయితే, తాను జగన్ కు అనుకూలం కాదు అంటూనే, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలుస్తాడని ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు వ్యతిరేకులతో కలిసి, ఎప్పుడూ చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు..
ఇలాంటి ఉండవల్లి నోట, మొదటి సారి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు అనే మాట వచ్చింది... అయితే ఇక్కడ కూడా ఆయనకు ఇగో అడ్డు వచ్చింది. జగన్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాని, చంద్రబాబు పోల్ మ్యానేజ్మెంట్ తో బయట పడతారని, చంద్రబాబు గెలుపుని ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నారు.. ఇవాల్టి రోజున ఏ పార్టీ అయినా పోల్ మ్యానేజ్మెంట్ లో దిట్టగానే ఉన్నారు.. జగన్ దగ్గర డబ్బు ఉంది, ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారుడు ఉన్నాడు... అలాంటి జగన్ కు పోల్ మ్యానేజ్మెంట్ తెలియదు అంటే ఎవరు నమ్ముతారు... కాకపొతే, చంద్రబాబు గెలిచిపోతారు అనే ఊపు ఉంది కాబట్టి, స్లో గా ట్యూన్ మారుస్తున్నాడు ఉండవల్లి.. ప్రజల్లో ఉంటేనే కదా, పోల్ మ్యానేజ్మెంట్ తో గట్టెక్కేది... ప్రజల్లో అభిమానం లేకుండా, పోల్ మ్యానేజ్మెంట్ తో గట్టేక్కలా అయితే, తెలంగాణాలో తెలుగుదేశం ఎందుకు అధికారంలోకి రాలేక పోతుంది ?
మరో పక్క, జగనసేన పార్టీ గురించి విలేకరులు అడగగా, 'ఆ పార్టీకి ఇంకా మేనిఫెస్టో లేదు. ఎవరితోనైనా పొత్తులుంటాయో లేదో స్పష్టత లేదు. పార్టీ నిర్మాణం కూడా లేదు. కానీ పవన్ సభలకు యువత వస్తున్నారు' అంటూ చెప్పారు. 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని, కాఫర్‌డ్యాం ద్వారా నీరు మళ్లించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు ఏ పార్టీపైనా వ్యతిరేకత లేదని చెప్పారు. తానిక ఎన్నికల్లో పోటీ చేయనని, నామినేటెడ్ పదవులు కూడా తీసుకోనని చెప్పారు. ‘రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నానని ఎవరైనా చెబితే అది నిజం కాదు. కమ్యూనిస్టులైనా సరే డబ్బు వసూలు చేయకుండా పని చేయలేరు. చివరకు గాంధీజీ కూడా డబ్బు సహాయం కోరకుండా నడవలేరు. ప్రధాని మోదీ అవినీతి చేయకపోవచ్చు. కానీ అధికారం కోసం ఏదైనా చేస్తారు’. అని ఉండవల్లి అన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఉండవల్లికి జ్ఞానదయం అయ్యింది, ఇక మిగిలిన ముతక బ్యాచ్ కూడా రియాలిటీ ఏంటో, గ్రౌండ లెవెల్ లో ఎలా ఉందో అర్ధం చేసుకుంటే, రేపు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత, కోమాలోకి పోకుండా ఉండగలుగుతారు.