ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషికి మరో ఫలితం వచ్చింది. ఎలక్ట్రానిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ లోహియా ఆటో దక్షిణ భారతంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నది. 7 బిలియన్ డాలర్ల విలువైన లోహియా గ్లోబల్ కు చెందిన లోహియా ఆటో ఇండస్ట్రీస్, తన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పటానికి సిద్ధమైంది. లోహియా ఆటో సిఇఓ ఆయుష్ లోహియా మాట్లాడుతూ, దక్షినాదిన మా ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ స్థలాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, కర్ణాటకన, తెలంగాణా రాష్ట్రాలు పోటీ రాగా, లోహియా మాత్రం, ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 50-75 ఎకరాల భూమి అవసరమవుతుంది, ఒక బిలియన్ వరకు పెట్టుబడి పెడుతున్నామని లోహియా ఆటో సిఇఓ ఆయుష్ లోహియా అన్నారు.
లోహియా ఆంధ్రప్రదేశ్ లో కనుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టిన ఆటో బ్రాండ్లు కియా, హీరో, ఐసుజు, అశోక్ లేల్యాండ్ సరసన చేరుతుంది. వీరే కాదు, ఇప్పటికే ఆటో-విడి భాగాలు తయారీదారులు కూడా ఆంధ్రప్రదేశ్ లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. లోహియా కొత్త ప్లాంట్ 100,000 యూనిట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాలలో 300,000 యూనిట్లు వరకు చేరుకునే అవకాసం ఉంది. దేశీయ మరియు విదేశీ మార్కెట్ల కోసం, EV లు, మోటార్ సైకిల్స్ మరియు గ్యాసోలిన్ వాహనాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది.
ఈ ప్లాంట్ 2020-21 నాటికి సిద్ధం చేసేలా ప్రణాలికలు రచిస్తున్నారు. ఈ కొత్తప్లాంట్ లో విద్యుత్, డీజిల్ వాహనాలు తయారు చేస్తారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని కాశీపూర్ ప్లాంట్ నుండి 100,000 యూనిట్ల వరకు, రెండు, మూడు చక్రాల వాహనాలను లోహియా ఆటో, ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది. హంఫాఫర్ DLXP గ్యాసోలిన్ వాహనాలను, నేపాల్, బంగ్లాదేశ్లకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 35 వేల వాహనాలు అమ్ముడవగా, దీంట్లో సంస్థ 12 వేల యూనిట్లు విక్రయించింది. ప్రస్తుతం రూ.30 నుంచి 35 వేల మధ్య ధర కలిగిన నాలుగు స్కూటర్లను సంస్థ విక్రయిస్తున్నది. వీటిని ఒక్కసారి రీచార్జి చేస్తే 80 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణం చేయవచ్చును. హమ్‌రాహి పేరుతో రూపొందించిన ఈ-రిక్షాలు కూడా త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి. మొత్తానికి, మరో పెద్ద కంపెనీని, ఆంధ్రప్రదేశ్ ఆకట్టుకుంది.