అందరి టార్గెట్ చంద్రబాబు... బీజేపీ, పవన్, జగన్ తెర ముందు డైరెక్ట్ గా, కలిసి చంద్రబాబు పై పోరాటం చేస్తుంటే, వెనుక నుండి ముద్రగడ, ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి ఉన్నారు. వీరి అందరి టార్గెట్ చంద్రబాబుని దించటం. మొన్నటి వరకు జగన్, ముద్రగడ మాత్రమే ఈ లిస్టు లో ఉండేవాడు.. ఒక్కసారి చంద్రబాబు బీజేపీని డీ కొట్టటంతో, బీజేపీ వీరందరి చేత, చంద్రబాబు పై దాడి చేపిస్తుంది.. వింత ఏమిటి అంటే, చంద్రబాబుని ఇబ్బంది పెడతాం అని చెప్పి మరీ, దాడి చేస్తుంది.. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గట్టిగా అడగటం.. దగా పడ్డ రాష్ట్రానికి, విభజన హామీలు నెరవేర్చండి అని అడగటం.. మాకే ఎదురు తిరుగుతువా అని ఢిల్లీ పెద్దలు, మన ముఖ్యమంత్రి పది దాడి చేస్తుంటే, వీరందరూ ఆ ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నారు.
అయితే ఇప్పడు కొత్తగా మోత్కుపల్లి నరసింహులును కూడా రంగంలోకి దింపేందుకు ఆయనతో వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మంతనాలు జరిపారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ నేతగా మోత్కుపల్లి వైసీపీలో చేరలేదు. కానీ ఆ పార్టీ స్పాన్సర్‌షిప్‌తో చంద్రబాబును విమర్శించడానికి రెడీ చేయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. ఆంధ్రాలో మా జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధ్దిచెప్పే సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి రావాలని ఆయన మోత్కుపల్లిని కోరారు.
అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత వారం తిరక్కుండానే ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఢీ కొట్టడానికి తన ఇమేజ్ మైనస్‌గా మారడం జగన్‌ను కలవరపెడుతోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి, వెంటాడుతున్న ఈడీ కేసులు జగన్ అభత్రాభావానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు పనిమంతుడనే ఇమేజ్‌ను వీలైనంతగా తగ్గిస్తేనే తనకు ప్లస్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న వారందరినీ కూడగట్టి రాజకీయ విమర్శలకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.