మొత్తం అమరావతికేనా అనే వారికి, ఇలాంటివి అసలు కనపడవు.. కనిపించినా, పక్కన పడేస్తారు... చంద్రబాబు చొరవతో, తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారవుతుంది. ఇప్పటికే తిరుపతి మొబైల్ తయారీ హబ్ గా తయారయ్యింది... ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ తయారీ మొదలు పెట్టారు... ఇప్పుడు లిథియమ్ అయాన్ బ్యాటరీలు కూడా తిరుపతిలోనే తయారుకానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీకి లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్రాజెక్టు రాబోతోంది. మనోత్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ రూ.799 కోట్లతో తిరుపతిలో కంపెనీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇదొక్కటి వస్తే మరిన్ని మొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మనోత్ ఇండస్ట్రీస్ తొలి విడతలో రూ.165 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
అందులో భాగంగా రోజుకు 2 లక్షల ఏహెచ్(ఆంపియర్ అవర్) నిల్వ సామర్థ్యంతో లిథియమ్ ఐయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే ఇది అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ పరిశ్రమకు లిథియమ్ అయాన్ బ్యాటరీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో మొత్తం 120 కంపెనీలు మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో 20 మాత్రమే బ్యాటరీ ప్యాక్ యూనిట్లు కలిగి ఉన్నాయి. మిగతా కంపెనీలు బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. మనోత్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోయే బ్యాటరీ కంపెనీ మొత్తం సామర్థ్యం రోజుకు మిలియన్ ఏహెచ్లు. 1700 మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ సంస్థ ప్రతినిధులు ఇలా చెప్పారు... “As a core component shall be manufactured in India, the natural corollary of this will be that there will be an increase in the value addition of the battery pack and eventually the mobile handset. An ecosystem of SME start-ups around Lithium ion products will also be planned. In order to deepen and widen the components manufacturing eco-system in India Government of India notified the phased manufacturing program (PMP) on April 28, 2017. This sent a clear signal to the investors and manufacturers that government was/is serious to promote mobile handset manufacturing in the country”