మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, రెండు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే ప్రచారం చేపిస్తుంది బీజేపీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, తిరుమల గొడవ... ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, ముద్రగడ, ఐవైఆర్, ఉండవల్లి లాంటి ఉద్దండులను ఈ ఆపరేషన్ గరుడలోకి తీసుకువచ్చిన బీజేపీ, ఇప్పుడు తాజాగా తెలంగాణా నాయకుడు మోత్కుపల్లిని కూడా, ఆపరేషన్ గరుడలోకి ఆహ్వానించింది.. ఈ విషయం పై తదుపరి ఆదేశాలు ఇవ్వటానికి, ఆపరేషన్ గరుడలో సీనియర్ మెంబెర్, ఈ రోజు మోత్కుపల్లి ఇంటికి వెళ్ళరు..
ఇంతకీ ఆ సీనియర్ ఎవరు అనుకుంటున్నారా ? మన A2 విజయసాయి రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. మోత్కుపల్లికి తదుపరి ఆదేశాలు ఇవ్వటం కోసమే విజయసాయి రెడ్డి అక్కడకు వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే, అక్కడ మీడియా ఉండటం గమనించి అక్కడ నుంచి పరారయ్యాడు. మీడియాని చూసి వెళ్ళిపోయాడు అంటేనే, అక్కడ ఏ లెవెల్ లో కుట్ర ప్లాన్ చేసారో అర్ధమవుతుంది. కొన్ని రోజుల క్రితం మోత్కుపల్లిని, ముద్రగడ కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయి రెడ్డి కలవటానికి వెళ్లారు.
ఇప్పటికే అన్ని వైపుల నుంచి, అస్త్రాలను చంద్రబాబు మీదకు వదిలామని, పెద్దగా ఉపయోగం ఏమి లేదని, అందుకే తెలంగాణా నేత నుంచి కూడా చంద్రబాబు పై విమర్శలు చేస్తే, బాగుంటుంది అని, మీరు కూడా రండి అంటూ, మోత్కుపల్లిని, ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించారు ముద్రగడ.. దీంతో మోత్కుపల్లి కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వస్తానని, ఒక రధయాత్ర చేస్తానని, చంద్రబాబుని దించేలానే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతానని, ముద్రగడకు మాట ఇచ్చారని తెలుస్తుంది.. బహశా ఆ విషయంలోనే, విజయసాయి రెడ్డి, మోత్కుపల్లిని కలవటానికి వెళ్లి ఉంటారని తెలుస్తుంది. ఇదే విషయం ఒక టిడిపి సీనియర్ నాయకుడు వద్ద ప్రస్తావించి, స్పందన కోరగా, ఆయన మాట్లాడుతూ, "ఇందులో చెప్పటానికి ఏముంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాల్తుంది" అని సింగల్ లైన్ లో తేల్చేసారు...