అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బాధితుల కష్టాలు తీరే అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదు. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని జీటీవి ఎస్సెల్‌ గ్రూపు ఆస్తుల విషయంలో చేసిన గందరగోళ ప్రకటనలు మదింపు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయలేమని ఈ నెల 4న హైకోర్టులో పిటిషన్‌ వేసి చేతులెత్తేసిన ఎస్సెల్‌ గ్రూపు 24 గంటలు గడవక ముందే మరలా యూ టర్న్‌ తీసుకుంది. ఈ నెల 5న తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి హైకోర్టును అనుమతి కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.

agrigold 11062018 2

చర, స్థిరాస్తులను పూర్తిగా మదింపు చేయకుండానే ఆస్తులు తక్కువ, అప్పులు ఎక్కువని బాధితులకు నష్టం కలిగించే ప్రకటనలు గతంలో చేసింది. అగ్రిగోల్డ్‌ కేసును పర్యవేక్షిస్తున్న సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు ఆగ్రిగోల్డ్‌కు కోట్లాది రూపాయిల ఆస్తులున్నాయని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని గతంలో జరిగిన డిపాజిటర్ల సమావేశంలో ప్రకటించారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించి, ఆ తరువాత తాము టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ కోర్టుకు తెలియజేయడంపై బాధితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో ఆస్తుల మదింపు, టేకోవర్‌ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికి ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంత డిపాజిట్‌ చేస్తే అంత మేరకు మాత్రమే సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు ఆస్తుల్ని బదలాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

agrigold 11062018 3

ప్రభుత్వం ముందుకు వచ్చి, ఆగ్రిగోల్డ్ బాధితులకు మేమే సాయం చేస్తాం, తక్కువ ఉన్న డిపాజిట్ దారులకు మేమే ఇస్తాం అనటంతో, ఈ ప్రక్రియని ఆలస్యం చెయ్యటానికి, మాకు వద్దు అని అంటున్న, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చి మేము తీసుకుంటాం అంటుంది. ఇవన్నీ చూస్తుంటే, ఇది కావాలని, ప్రభుత్వం ఏ రకమైన సహాయం చెయ్యకుండా, కొన్నాళ్ళ పాటు, అంటే ఎన్నికలు దగ్గర పడే దాక, ఆలస్యం చేసే ప్లాన్ లో భాగంగానే, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చినట్టు, ఈ ఎస్సెల్‌ గ్రూపు బీజేపీ ఎంపీది కావటం, ఇవన్నీ అనుమానాలను బలం చేకురుస్తున్నాయి. సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన జీటీవి ఎస్సెల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ముందుకొచ్చింది. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. రూ.10 కోట్లు డిపాజిట్‌ చేసి సిఐడి ఆధ్వర్యంలో ఆస్తుల మదింపు కార్యక్రమంలోనూ కొంతకాలం పాల్గొంది. ఆగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, జైళ్లలో ఉన్న అగ్రిగోల్డ్‌ డైరక్టర్లతో భేటీ అవ్వడానికి కూడా ఎస్సెల్‌ గ్రూపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. తొమ్మిది నెలల తరువాత తాము టేకోవర్‌ చేయలేమని చెప్పి మరలా ఒక రోజు వ్యవధిలోనే టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ మాట మార్చింది. దీంతో ఎస్సెల్‌ గ్రూపు ఆధ్వర్యంలో టేకోవర్‌ సాధ్యాసాధ్యాలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read