ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెకాన్ తాజా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇటీవల దిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

cbn 20062018 2

మరో పక్క, కడప ఉక్కు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేపట్టబోయే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. కడప జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో, దీక్ష జరుగుతుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుండడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమంటూ ప్రకటించారు.ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం అందించాలని ఢిల్లికి వెళ్లి ప్రయత్నించినా ప్రధాని కార్యాలయం, పర్మిషన్ ఇవ్వకపోవటంతో కలువలేకపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రికి లేఖ ద్వారా జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై వివరించారు.

cbn 20062018 3

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ఆ లేఖలో తెలియ జేశారు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవ డంతో ఆమరణ నిరాహారదీక్షకు ఆయన సిద్దమయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం లోటు బడ్జెట్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాలు కల్పన వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇవ్వాలని ఉందని సియం రమేష్ పేర్కొన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి సెయిల్‌ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని చట్టంలో 13వ షెడ్యూల్‌లో మూడో పాయింట్‌లో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read