ఫెడరల్ ఫ్రంట్ అని హడావిడి చేసిన కెసిఆర్, మాకు ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారితోనే పొత్తు అంటున్న జగన్... ఇప్పుడు ఇద్దరూ కలిసి, బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే వీరు రహస్య స్నేహితులు అయినా, బయటకు మాత్రం, బిల్డ్ అప్ ఇస్తూ ఉంటారు. తెలంగాణాలో అదికారంలో ఉన్న కేసీఆర్, ఆంద్రలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి లతో, అమిత్ షా మంతనాలు చేసినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం దూరం అవ్వటం, శివసేన అడ్డం తిరగటంతో, కేసిఆర్ జగన్ లను కలుపుకుని, మాకు బలం ఏ మాత్రం తగ్గలేదు అని బీజేపీ చూపించాలి అనుకుంటుంది. ఇందుకోసం, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలను, బీజేపీ వాడుకుంటుంది. త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీల మద్దతు అమిత్ షా కోరారు.
రాజ్యసభలో 245 అభ్యర్ధులు ఓటింగ్ కు వస్తే, డిప్యూటీ చైర్మెన్ పదవికి 122 ఓట్లు అవసరం. తెలుగుదేశం పార్టీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం 117 మంది ఉన్నారు. అలాగే, బీజేపీ తన మిత్రపక్షాలు, ఏఐడీయంకే కలుపుకిని, 111 మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో బీజేడీ పార్టీకి చెందిన 9 మంది, తెరాసా కు చెందిన 6 గురు, వైసిపీ కి చెందినా 2 మంది, కీలకం కానున్నారు. బీజేడీ మద్ధతు ఇచ్చిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మద్ధతు బీజేపీకి అవసరమవుతుంది. టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వింది కనుక ఆ పార్టీకి మద్ధతిచ్చే అవకాశం లేనే లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు బీజేపీకి అనివార్యం అవుతుంది.
కథ అంతటితో అయిపోలేదు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిని నిలిపే యోచనలో కొన్ని ప్రాంతీయ శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ కన్నెర్ర - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్రహం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది. సైలెంట్ గా ఓటింగ్ కు దూరంగా ఉంటే, అమిత్ షా తన్ని లోపల వేస్తాడు. అందుకే జగన్ కు తప్పని పరిస్థితి. ఇక కెసిఆర్ ఆడుతున్న ఫెడరల్ ఫ్రంట్ డ్రామా కూడా తెర పడుతుంది. మొత్తానికి, ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికతో, దేశ రాజకీయం మరో మలుపు తిరగనుంది.