అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అయితే, ఈ సారి మాత్రం, కుటుంబరావు చేతిలో కాకుండా, సొంత పార్టీ ప్రభుత్వం చేతే ఫూల్ అయ్యాడు. రెండు రోజుల క్రితం జీవీఎల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించే ఇళ్ల విషయంలో టిడిపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని జి.వి.ఎల్ నరసింహరావు ఆరోపించారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేవలం పచ్చ చొక్కాల వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని...పేదలు అడిగితే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, రెండు వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటూ జివిఎల్ విమర్శించారు.
అలా జీవీఎల్ ఆరోపణలు చేసాడో లేదో, ఇలా కేంద్రం ఇళ్ళ నిర్మాణాల పై ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ తో, జీవీఎల్ ఫీజులు మరో సారి ఎగిరిపోయాయి.. ప్రతి సారి కుటుంబరావు చేతిలో ఫూల్ అయ్యే జీవీఎల్, ఈ సారి కేంద్రం చేతిలోనే ఫూల్ అయ్యారు. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ మంచి పనితీరు కనబరుస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇళ్ళ నిర్మాణాల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందని కితాబు ఇచ్చింది. అలాగే మధ్యప్రదేశ్,తెలంగాణా పై కూడా ప్రశంసలు కురిపించింది కేంద్రం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జరుగుతున్న పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ తీరును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమీక్షించింది.
కొత్తగా ఆరు రాష్ట్రాలకు 3.18 లక్షల ఇళ్లను మంజూరుచేసింది. దీంతో ఇప్పటివరకూ మంజూరుచేసిన ఇళ్ల సంఖ్య 51 లక్షలకు చేరినట్లు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. పథకం ప్రారంభించిన మూడేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు మంజూరుచేయడం గొప్ప విషయమని పేర్కొంది. ఇదివరకు తొమ్మిదేళ్లలో 12.4 లక్షల ఇళ్లు మంజూరుచేయగా, ఈ మూడేళ్లలోనే 51 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 28 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాలు దేశంలో అత్యుత్తమ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతికతను ఉపయోగించి వివిధ రాష్ట్రాలు ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది.