మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు మంగళవారం నాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పళ్లంరాజు కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. త్వరలోనే కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీతో సమావేశం కానున్నారు. ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించిన ఉమెన్ చాందీ కాంగ్రెస్ పార్టీలో 2014 వరకు కీలకంగా వ్యవహరించిన నేతలతో సంప్రదింపులు జరపాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. ఈ సూచనతో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని .పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతను పళ్లంరాజుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

kiran 27062018 2

కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడ కిరణ్‌కుమార్ రెడ్డికి సూచించారని సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ గురువుగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని భావిస్తారు. ఇటీవల కాలంలో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారనే ప్రచారం కూడ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో పార్టీని ముందుండి నడిపించే బలమైన నేత కరువయ్యారని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో ఏపీలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే కిరణ్‌తో సంప్రదింపులు జరిపారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయు. రాష్ట్రంలో అధికార పక్షాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ప్రధాన ప్రతిపక్షం వైసీపీని టార్గెట్‌ చేయకపోతే కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఎలా వస్తుందని కిరణ్‌ అన్నట్లు సమాచారం.

kiran 27062018 3

ఇటీవల రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్‌ వైసీపీని టార్గెట్‌ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది కిరణ్‌తో మంతనాల ప్రభావమేనని తెలుస్తోంది. కాగా.. కిరణ్‌ కాంగ్రె్‌సలోకి వెళ్లినా.. జాతీయ రాజకీయాలపైనే దృష్టి సారిస్తారని.. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని అంటున్నారు. పార్టీని వీడే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైపోతుందని, తెలంగాణలోనూ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. నాడు కిరణ్‌ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో.. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read