కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం, మోడీ చేస్తున్న వంచనకు వ్యతిరేకంగా, తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని జనసేన ఎద్దేవా చేసింది. గత ఏడు రోజులుగా కడప ఉక్కు కర్మాగారం కోసం, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు దీక్ష చేస్తున్నారు. వీరి దీక్ష చూసి, ఏడు రోజులు అయినా ఇలాగే ఉండటంతో, పక్కన ఉన్న తమిళనాడు డీఏంకే పార్టీ వచ్చి, మనకు మద్దతు ఇచ్చి ఆందోళనలో పాల్గున్నారు. మన దౌర్భాగ్యం ఏంటో, బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, దీక్ష చేస్తున్న వారికి కనీస మానవత్వంగా కూడా సపోర్ట్ ఇవ్వకుండా, ఎద్దేవా చేసే పార్టీలు మన మధ్య ఉన్నాయి. రెండు రోజలు క్రితం పవన్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ రాకపోవటానికి, చంద్రబాబు కారణం అన్నాడు.. ఇక జగన్ అయితే సరే సరి.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళు ఆందోళన చేస్తుంటే, హైదరాబాద్ పార్టీ ఆఫీస్ లో కూర్చుని, జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేత శ్రీ మాదాసు గంగాధరం మాట్లడారు. కేంద్రం పై పోరాటం చేస్తున్న పవన్ ఎక్కడ, దొంగ దీక్షలు చేస్తున్న రమేష్ ఎక్కడ అంటూ ఎద్దేవా చేసారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. పవన కళ్యాణ్ కేంద్రం పై పోరాడే తీరు అందరికీ ఆదర్శం అని అన్నారు. అదే విధంగా, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం, చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదని తమ పార్టీ అభిప్రాయం అని చెప్పారు.
దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి... ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని మాదాసు ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి వార్తా, ఆ సాక్షిలో తప్ప ఎక్కడా రాలేదు. ఆ వార్తా పట్టుకుని, వీరి దీక్షలో చిత్తశుద్ధి లేదు అని, దొంగ దీక్ష అని జనసేన పార్టీ తేల్చింది. అంతే కాదు, అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే జనసేన తప్పకుండా ప్రశ్నిస్తుందని... అమరావతితోపాటు అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి, ఇక్కడ ఏమి జరుగుతుందో కనీసం అవగాన లేదు. ఈ రోజు ప్రపంచంలోనే టాప్ 3 లో ఉన్న ఫ్లెక్స్ట్రానిక్స్ అనే కంపెనీ, తిరుపతిలో పెట్టుబడి పెట్టింది. ఇది అమరావతిలో ఉందని జనసేన పార్టీ అనుకుంటే ఏమి చెయ్యలేము.. ఇదండీ, వీరి సంగతి...