రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా 2 లోల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రపంచంలో ఐదు పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో మూడోస్థానంలో ఉన్న ఫ్లెక్స్ట్రానిక్స్ కంపెనీ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. సచివా లయంలోని ఒకటవ బ్లాక్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి మాట్లా డారు. ప్లెక్స్ట్రానిక్స్ చాలా పెద్ద సంస్థ అని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. రూ. 585 కోట్లతో ఆగస్టు 15న తిరుపతిలో ఏర్పాటుకాబోతున్న ఈ యూనిట్వల్ల 6,600 మందికి ఉద్యోగాలొస్తాయని తెలిపారు. ఫ్లెక్స్ ట్రానిక్స్ యూనిట్లో మెబైల్ ఫోన్లలో వినియోగించే పరికరాలు తయారు చేస్తారన్నారు.
ఈ పరిశ్రమ ఏర్పాటుకోసం మూడు నెలల నుండి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పటికి తమ కష్టం ఫలించి ఒక రూపు వచ్చిందని తెలిపారు. మొబైల్ తయారీలో 50 శాతం మేర ఏపీ నుండే ఉత్పత్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆయన లక్ష్యం మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామన్నారు. 2014లో ఏపీలో ఒక్క ఎలక్ట్రానిక్ సంస్థ కూడా లేదని, ఇప్పుడు రిలయన్స్ వంటి అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయ న్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టు కున్నామని మంత్రి తెలిపారు.
ఇది ఇలా ఉంటే, ఈ కంపెనీతో చర్చలు అన్నీ సీక్రెట్ గా సాగాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉండడమే దీనికి కారణం. బెంగళూరు, తిరుపతిలో ఆ సంస్థ ప్రతినిధులను కలిసినప్పుడు కూడా విషయాలు ఎవరికీ వివరించలేదు. తర్వాత ఈ మూడు నెలల కాలంలో పలుమార్లు చర్చలు జరిపినా మీడియాకు చెప్పలేదు. ఒప్పందానికి ఒకరోజు ముందు మీడియాకు సమాచారం ఇచ్చినా.. ఒక పెద్ద కంపెనీ వస్తుందన్నారే తప్ప.. కంపెనీ పేరు మాత్రం వెల్లడించలేదు. పెద్ద పెద్ద నగరాలు లేని, సేవా రంగం అంతగా అభివృద్ధి చెందని మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకొచ్చేందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు.