ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని నగరంలోని రాయపూడిలో, ఐకానిక్ టవర్ కు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కృష్ణా నదికి అభిముఖంగా... 33 అంతస్తులలో ఐకాన్‌ టవర్‌ ఉంటుంది... 500 కోట్లతో నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్ట్, 18 నెలల్లో పూర్తవుతుంది. ఇది రాజధానికే ఒక వజ్రంలా ఉంటుందని సొసైటీ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కృష్ణానదికి మధ్యన ఉండటం వల్ల ప్రకృతి ఒడిలో ఇమిడినట్లుగా ఉంటుంది. 33వ అంతస్తులో రూఫ్‌టాప్‌ పూల్‌, ఎన్‌ఆర్‌టీ క్లబ్‌ ఉంటాయి. ప్రైవేటు కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, జిమ్నాజియం కూడా ఉంటాయి. ఐకాన్‌ చుట్టూత ఇన్‌సులార్‌ స్కిర్ట్‌ ఏర్పాటు చేయడం వల్ల 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. రూప్‌ టాప్‌ గార్డెన్స్‌తో సహజసిద్ధమైన చల్లదనం అమరుతుంది. నీటిని పొదుపు చేసేందుకు కూడా ప్రాజెక్టులు చేపడతారు. సోలార్‌ విద్యుత్‌తో కార్బన్‌ ఎమిషన్స్‌ ఉండవు. రివర్‌ఫ్రంట్‌లో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు స్పెషాలిటీ కియోస్క్‌లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో సంస్థకి 4,500 ఎస్‌ఎఫ్‌టీని కేటాయిస్తారు.

ntrtower 23062018 2

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచానికి సేవలు అందించే అదృష్టం కల్పించిన జన్మభూమి రుణాన్ని తీర్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్మ ర్మేషన్‌ టెక్నాలజీ అంటే సిలి కాల్‌ వ్యాలీ ఏవిధంగా గుర్తుకు వస్తుందో అదే తర హాలో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా రూపొందిం చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రవాసాంద్రులు జన్మభూమిని మరు వకూడదని, ఏ దేశంలో స్థిరపడతారో ఆ దేశ ప్రజలతో మమేకం కావాలన్నారు. ఆయా దేశాలలో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అదే సమయం లో వారు జ న్మించిన రాష్ట్రానికి, గ్రామానికి చేయూతను అం దించాలన్నారు. ఏపీ ఎన్నార్టీలో 120 దేశాల నుంచి ప్రవా సాంధ్రులు ప్రాతినిధ్యం ఉందని, దేశంలో మరే ఇతర రాష్ట్రా నికి ఈ ఘనత లేదన్నారు. గత నాలు గేళ్లలో నాలెడ్జ్‌ సోసైటీకి పెద్ద పీట వేశామని, విదేశాల లో భారత కీర్తిని పెంచడంలో తెలుగువారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు.

ntrtower 23062018 3

తెలుగువారి సంక్షేమం కోసం ఏపి ఎన్‌ఆర్టీని పెట్టా మని, దీనిలో 83వేల మంది సభ్యులు చాలదేశాల నుంచి ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీరిలో 620 మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకు వస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రపంచం తీరే మారిందని అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, ఆలీబాబా లాంటి ఆన్‌లైన్‌ కంపెనీలు ఐటీని వినియో గించుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నా యని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచన సంపద సృష్టికి మూలమని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఏపీ ఎన్‌ఆర్పీలు రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టడంతో పాటు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఏపీ ఎన్‌ఆర్టీలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. తెలుగుజాతి సత్తా ఒక సక్సెస్‌ స్టోరీ కావాలని ఆకాం క్షించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read