ప్రభుత్వాలికి కూడా తెలియని సమాచారం పవన్ కళ్యాణ్ కు తెలిసిపోతూ ఉంటుంది. ఈయన ఎయిర్ పోర్ట్ లో ఉండగా, ఐపిఎస్ ఆఫీసర్ లు, ఇంటలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ కు వచ్చి నివేదికలు ఇస్తారు. కామెడీగా ఉన్నా, పవన్ చెప్పే మాటలు ఇవి. ఏ సందర్భంలో, ఏ ఇష్యూ వచ్చినా, నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటూ, పవన్ ఎదో చెప్తూ ఉంటారు. అలాగే తిరుమల ఇష్యూ పై కూడా స్పందించారు. తిరుమలలో శ్రీవారి గులాబీ వజ్రం, పలు నగలు మాయమయ్యాయని, ఈ విషయం నాకు కొన్నేళ్ళ క్రిందటే తెలుసని, స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు తరలించినట్టు నాకు ఒక ఐపిఎస్ ఆఫీసర్ చెప్పారు అంటూ, పవన్ కళ్యాణ్ రెండో రోజుల నుంచి వరుస ట్వీట్లు వేస్తున్నారు. ఈ వ్యాఖ్యల పై, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

pawan 23062018 2

వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి కుట్రకు వైసిపి, జనసేన ప్రధాన సూత్రధారులని వ్యాఖ్యానించారు. తిరుమలపై దుష్ప్రచారానికి రమణ దీక్షితులను పనిముట్టుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తిరుమల కొండపై అనేక సమస్యలు వచ్చినప్పుడు రమణ దీక్షితులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, ఎన్వీ ప్రసాద్‌ వంటి పలువురు అధికారులు దీక్షితుల నైజాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. బిజెపి స్క్రిప్ట్‌ను పవన్‌ ట్వీట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలకు వెంకటేశ్వరస్వామి గుడినీ వాడుకోవడం దారుణమని విమర్శించారు.

pawan 23062018 3

పవన్‌ అంటేనే గాలి అని, గాలి వార్తలు నమ్మి వాటిని చెప్పడం తప్ప, ఆయనకు సొంతగా ఆలోచించే శక్తి లేదని, ఆయన అజ్ఞాతవాసని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ రీల్‌ లైఫ్‌ నుంచి రియల్‌ లైఫ్‌కు ఉన్న తేడాను గమనించాలని హితవు పలికారు. ఎవరో ఏదో చెబితే అదే నిజం అనుకుని జనం ముందు చెప్పడం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమన్నారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు. ఎప్పుడో ఎయిర్‌పోర్టులో ఐపిఎస్‌ అధికారి చెప్పిన విషయాన్ని ఇప్పటి వరకు పవన్‌ ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఆ పోలీస్‌ అధికారి పేరు చెబితే పిలిపించి వాస్తవాలు మాట్లాడతామన్నారు. 1952 తరువాత వెంకటేశ్వరస్వామి నగలకు సంబంధించి అన్ని రికార్డులూ ఉన్నాయని, రాయల ఆభరణాల రికార్డులు 1952కు ముందే లేవని కెఇ చెప్పారు. వెంకన్న మహిమగల దేవుడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరికీ మంచిది కాదు.. చేటు తప్పదు అని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read