మొన్న అనంతపురం... నిన్న కర్నూలు... నేడు విశాఖ..రేపు బెజవాడ... ఇది చంద్రబాబు ప్రతి జిల్లాకి, ప్రతి వర్గానికి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరు... రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో భూముల రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారందరికీ భోజనాలు పెట్టి మరీ , పట్టాలు పంపిణీ చేసి, వారి జీవితాలకు సొంత ఇల్లు ఉంది అనే భరోసాను ఇచ్చారు. విశాఖలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, నిర్మించిన ఇళ్ళను రెగ్యులరైజ్ చేస్తూ జిఓ 296ను జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 2016 నవంబర్లో 30,686 మంది లబ్దిదారులు ఆక్రమించిన 19,05,580 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఆక్రమించిన స్థలం అప్పటి విలువ చదరపు గజం 25 వేల రూపాయలుగా ఉంది. అప్పడు రెగ్యులరైజ్ చేసిన భూమి విలువ 4763 కోట్ల.

pattalu 24062018 2

రెండో విడతలో, జూలై 2017న, గాజువాక మండలంలోని 16,04,193 చదరపు గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేసారు. రెండో విడత పట్టాల పంపిణీలో 296 జిఓ ప్రకారం 796210 చదరపు గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేసారు. ఇక్కడ చదరపు గజం స్థలం విలువ 25 వేల రూపాయలు. దీని విలువ 1,990 కోట్లు, అలాగే జిఓ 301 ప్రకారం 5,385 మంది లబ్దిదారులు ఆక్రమించుకున్న 807983 చదరపు గజాల స్థలాన్ని రెగ్యులరైజ్ చేసారు. ఇక్కడ చదరపు గజం స్థలం విలువల 20వేల రూపాయలు. ఈ స్థలం మొత్తం విలువ 1616 కోట్లు. మూడో విడత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో గురువారం నిర్వహించారు. ఈ దఫా రూ.3,836 కోట్లు విలువ చేసే 9,16,991 చదరపు గజాల స్థలాన్ని 9,054 మందికి పంచిపెట్టారు. దీనికి సంబంధించి పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విశాఖలో పంపిణీ చేశారు.

pattalu 24062018 3

మొత్తంగా మూడు దఫాలుగా విశాఖపట్నంలో పేదలకు పంచిపెట్టిన భూముల విలువ రూ.10,589 కోట్లు. రెండు దశాబ్దాల క్రితం నగర శివారు, కొండవాలు ప్రాంతాల్లో స్థలాలు ఆక్రమించుకున్నా... ఇప్పుడు అవన్నీ అభివృద్ధి చెందిన నగరంలో భాగం కావడంతో వాటికి విలువ పెరిగింది. ఇచ్చింది 100 గజాల లోపు స్థలమే అయినా దాని విలువ ప్రాంతాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతోంది. పట్టాలు రావటంతో పేదలంతా ఇప్పుడు లక్షాధికారులయ్యారు. గాజువాకలో భూముల రెగ్యులరైజ్ సమస్య చాలా కాలంగా పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఇక్కడి భూముల రెగ్యులరైజేషన్ పై హౌస్ కమిటీని నియమించారు. కమిటీ అనేక సార్లు సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో గాజువాక భూముల రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రెగ్యులరైజేషన్ కు కావల్సిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రస్తుతం 100 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించుకున్న వారి స్థలాలను రెగ్యులరైజ్ చేసి, చంద్రబాబు తన హామీని నిలబెట్టుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read