అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడానికి, కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్ట ర్ నిమ్మల రామానాయుడు నేరుగా శ్మశాన వాటికలోనే రాత్రి నిద్ర చేశారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ స్మశాన వాటికను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి పనులు మందగమనంతో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే నిమ్మల పనుల నత్తనడక పై ఆరా తీశారు. శ్మశానంలో పనులు, మరో వైపు తవ్వకాల్లో ఎముకలు బయటపడడం తదితర కారణాలతో కార్మి కులు భయాందోళనలకు గురవుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వాస్తవానికి అభివృద్ది పనుల్లో 50 శాతం ఈ మాసాంతానికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పనుల పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.
కార్మికుల్లో నెలకొన్న భయాం దోళనలను పోగొట్టడానికి, మనోస్థైర్యం ఇవ్వడాని కి ఎమ్మెల్యే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆయన శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం పై నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు తేవడంలోనే ఆనందం లేదని వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధి జరిగినప్పుడే సం తృప్తి కలుగుతుందన్నారు. శ్మశానంలో నిద్రించడం పట్ల ఆయన స్పందిస్తూ తనకు ఏవిధమైన భయాందోళనలు లేవని, సాటి మనిషిగా కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనులను వేగవంతం చేయించడానికే రాత్రి బసకు ఉపక్రమించానని చెప్పారు.
పనుల జాప్యంలో కాంట్రాక్టర్ ప్రమేయం ఏమీలేదని, కార్మికుల ఇబ్బందుల వల్లనే ఆలస్యం జరిగిందన్నారు. ఇప్పుడు తాను చొరవ చూపి శ్మశానంలో మకాం వేయడంతో కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అవసరమైతే మరో ఒకటి, రెండు రోజులు అక్కడే ఉంటానన్నారు. రాత్రంతా స్మశానంలో నిద్రించిన ఎమ్మెల్యే ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత కప్పు కాఫీ తాగుతూ దినపత్రికలు చదివారు. అధికారులతో చర్చించారు. ఇంతకాలం స్మశానవాటిక అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని అధికారులు కార్మికులను వెంటపెట్టుకుని వచ్చారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయడానికి ఓ కదలిక వచ్చింది. నిమ్మల రామానాయుడుని, అక్కడ ప్రజలు చంద్రబాబుతో పోలుస్తూ ఉంటారు. చంద్రబాబు ఎంత కష్టపడి పని చేస్తారో, మా ఎమ్మల్యే కూడా అంతగా కష్టపడటతారని చెప్తూ ఉంటారు. ఈ సంఘటనతో అది మరోసారి రుజువైంది.