జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్ట్ నోటీసులు పంపించింది. సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో, ప్రభుత్వానికి కోర్ట్ నోటీసులు ఇచ్చింది. సమాచార కమిషనర్ల ఎంపిక, త్రిసభ్య కమిటీ చేస్తుంది. కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. అయితే, ప్రతిపక్ష నేత జగన్ ను, సమాచార కమిషనర్ల ఎంపిక చెయ్యాలని, అమరావతి రావలిసిందిగా, ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు కోరింది. అయితే, జగన్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేనని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చి, తన తరఫున ప్రతినిధి వస్తారని తెలిపారు. ఇందుకు నిబంధనల ప్రకారం వేరే వ్యక్తులకు అవకాశం లేదని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ప్రతిపక్ష నేత లేకుండా, ఈ ఎంపిక చేసే అవకాసం లేదు. దీని వల్ల ఎప్పటి నుంచో ఈ నియామకం పెండింగ్ లో పడింది.

jagan 23062018 2

అయితే, ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండటంతో, కోర్ట్ నోటీసు పంపించింది. సమాచార కమిషనర్లను ఎందుకు నియమించలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గతేడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

jagan 23062018 3

ఆపై కోర్టు ఆదేశానుసారం ఏపీలో స.హ కమిషనర్లను ఇప్పటివరకు నియమించలేదంటూ కోర్టుధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పై మేరకు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం, ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేసే పనిలో ఉంది. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత ఉండాలని, ఆయన ఎన్ని సార్లు పిలిచినా అందుబాటులోకి రాలేదని, అందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యింది అని చెప్పే అవకాసం ఉంది. అప్పుడు కోర్ట్ ఆదేశాలను బట్టి, ప్రభుత్వం ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు. ఇప్పుడు ఏకంగా, ప్రభుత్వనికే నోటీసు వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read