నీతి ఆయోగ్ సమావేశంలో, ప్రధాని మోడీకి, చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో వైసీపీ, జనసేన ఎంత గోల చేసిందో చూసాం. దేశం మొత్తం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులకు, ప్రధాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తే, ఆ సందర్భంలో చంద్రబాబు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి ఎదో ఒంగిపోయాడు అని, లొంగిపోయాడు అని, పిచ్చ ప్రచారాలు చేసారు. టీ బ్రేక్ సమయంలో, ప్రధాని మోడీ, అందరి ముఖ్యమంత్రులని పలకరిస్తూ, మమత, చంద్రబాబు, కుమారస్వామి దగ్గరకు వచ్చి, వీరిని కూడా పలకరించారు. దీని పై రచ్చ రచ్చ చేశారు. అయితే, ఇప్పుడు ఇదే పరిస్థితి పాపం పవన్ కళ్యాణ్ కు వచ్చింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమం సందర్భంగా జరిగన సంఘటనకు, పవన్ ఒక పెద్ద ట్వీట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది.

pk 23062018 2

విగ్రహ పత్రిష్టాపన కార్యక్రమంలో పాల్గున్న పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నవ్వుతూ అభివాదం చేసాడు. ప్రతిగా నమస్కారం చేసిన ముఖ్యమంత్రి. అలాగే ఇద్దరూ కలిసి, 20 నిమషాల పాటు మాట్లాడుకోవటంతో, టీవీల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. దీని పై పవన్ ట్వీట్ చేసారు. అంతే కాదు, ఈ ట్వీట్ తో, మొన్న ముఖ్యమంత్రి, ప్రధాని కలిసిన సందర్భంలో రెచ్చిపోయి హడావిడి చేసిన పవన్ ఫాన్స్ కు కూడా, గట్టిగా గడ్డి పెట్టాడు పవన్. రాజకీయ నాయకులు బయట ఏదో ఒక సందర్భంలో తారసపడుతుండటం, ఇలా ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం మామూలేనని, దానికి ఎదో అయిపొయింది అంటూ, హడవిడి చెయ్యటం మంచిది కాదు, అది సంస్కారం అంటూ, ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే, తప్పేమీ లేదు అని ట్వీట్ చేసారు.

pk 23062018 3

‘‘వైసీపీ, టీడీపీ నేతలు ఏదో ఒక సమయంలో తారసపడుతుంటారు. అలాంటప్పుడు వారి బాగోగులు కనుక్కోవడం జరుగుతుంటుంది. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు ఆ రెండు పార్టీల వారు కానీ, ఇతరులు కానీ ఏదో జరిగిపోతోందంటూ ఊహించుకోవద్దు. నేను కలుసుకున్న, పలకరించిన వారిలో చాలామంది నాకు తెలిసినవారే అయి ఉంటారు. గతంలో వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయడమే ఇందుకు కారణం. రాజకీయ విభేదాలను కేవలం విధానాల పరంగానే నేను చూస్తాను. వ్యక్తిగత కోణంలో చూడను. ఇది లోపించడం వల్లే వైసీపీ, టీడీపీలు అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనీయడం లేదు’’ అని పవన్ ట్వీట్‌ చేసారు. మొత్తానికి, పవన్ కు, పవన్ ఫాన్స్ కు ఇప్పుడు ఖర్మ సిద్ధాంతం గుర్తుకు వచ్చింది. మనం ఒకరిని అకారణంగా ఎగతాళి చేస్తే, అదే సందర్భం మనకు ఎదురు అవుతుంది, అప్పుడు మనం దానికి సమాధనం చెప్పుకోవాలి.. దీన్నే ఖర్మ సిద్ధాంతం అంటారు... రీల్ లైఫ్ కి, రియల్ లైఫ్ కి తేడా తెలుసుకుంటే, అందరికీ మంచిది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read