కేంద్రం నుంచి వచ్చిన సంకేతాలతో, సార్వత్రిక ఎన్నికల పై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాల్లో సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పై సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని, ఈ సారి అసెం బ్లి, పార్లమెంట్ ఎన్నికలే కాకుండా స్థానిక సంస్థలకు ఒకే సారి ఎన్నికలు జరగను న్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. నేతలు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఎన్నికల సంగ్రామానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో తలసరి ఆధాయం రెట్టింపు అయిందని, అదే విధంగా గడచిన మూడేళ్ళుగా రెండంకెల వృద్ధి సాధిస్తున్నామన్నారు.
పైసా అవినీతి లేకుండా ప్రతి నెల 50 లక్షల మందికి సామాజిక భద్రతా పించన్లు ఇస్తున్నామని దీనిపై ఏడాదికి రూ.5,700 కోట్లు వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నెలకు రూ.200 పించన్ ఇచ్చి 200 సార్లు చె ప్పేవారని, ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడంలో విఫలమవుతున్నారని నేత లపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మరో వైపు అన్ని రాజకీయ పార్టీలు టిడిపిపై విష ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించా ల్సిన అవసరం ఉందన్నారు.
మూడు పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని, ప్రతి రోజు తెలుగుదేశం ప్రభుత్వంపై పదిరకాల విమర్శలు చేస్తున్నారని వీటన్నింటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని నేతలకు అధినేత దిశా నిర్ధేశం చేశారు. ప్రతినేత, కార్యకర్త పరిస్థితులు, మారుతున్న రాజకీయాలను అవగాహన చేసుకుని విశ్లేషకులుగా తయారు కావాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండి పార్టీకి ఉన్న రాజకీయ బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరంటే నాకు మోహమాటం ఉంటుందేమో కానీ ప్రజలకు ఏమాత్రం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు నేతల కు స్పష్టం చేశారు. నాయకుడికి శత్రువు అహంభావమేనని, తనకు ఎదురులేదని ఎవ రన్నా భావిస్తే బోల్తా కొట్టడం ఖాయమని అన్నారు. కేడర్‌తో మమేకం అయినప్పుడే నాయకులుగా ఎదుగుదల ఉంటుందని హితబోద చేశారు.