సామాజిక స్పృహ ఎక్కువ ఉండే, తమిళ హీరో విశాల్, మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తమిళ హీరో అయినా, ఈ సారి తెలుగు ప్రజలకు కూడా సాయం చెయ్యటానికి ముందుకు వచ్చారు. ఈ మధ్య తన సినిమా ‘అభిమన్యుడు’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. సినిమా మంచి టాక్ తో, నడుస్తుంది. తొలివారంలోనే రూ.12 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని విశాల్ భావించారు. ఈ మేరకు సినిమా టికెట్‌పై రూపాయి చొప్పున రైతులకు అందిస్తామని తెలిపారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కాగా ‘అభిమాన్యుడు’ చిత్రం.. సైబర్ మోసాల నేపథ్యంలో తెరకెక్కింది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్నదానిపై కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, ఇతర అంశాలపై సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై కూడా సినిమాలో చూపించారు. దీంతో ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు తమిళ హీరో అయిన విశాల్, తెలుగు రాష్ట్రాల రైతుల కోసం, తన సినిమా కలెక్షన్స్ లో వచ్చిన వాటాను ఇస్తాను అనటం, సంతోషకరం. సెలబ్రిటీలుగా ఉంటూ, ప్రజల వల్లే పైకి వచ్చి, మళ్ళీ తిరిగి ప్రజల కోసం చేసే వారు చాలా తక్కువ. అలాంటి వారిలో విశాల్ ఒకరు.
అయితే ఇదే సందర్భంలో మన తెలుగు హీరోల గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణా పై అమిత ప్రేమ ఉన్నా, అది తెలంగాణా ప్రభుత్వం పై భయమే కాని, ప్రజల పై ప్రేమ కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి అయితే సరే సరి. ఇక్కడేమో, మా హీరో అని, మా కులపోడు అని గుడ్డలు చించుకుని కొట్టేసుకుంటాం, వారేమో కనీసం ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్క మంచి పని కూడా చెయ్యరు. ప్రత్యెక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రజలు రోడ్డు ఎక్కితే, ఒక్క టాప్ హీరో అయినా, స్పందించారా ? అదే తమిళనాడులో, కమల్, రజినీతో పాటు, అందరూ ఒకే వేదిక పైకివ్ అచ్చి కావీరే నీటి కోసం ఆందోళన చేసారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నటులు మన రైతుల కోసం ముందుకు వస్తున్నారు. ఇప్పటికైనా మన హీరోలు, కొంచెం సామాజిక స్పృహతో ముందుకు వస్తారని కోరుకుందాం...