సీనియర్ నటుడు, మాజీ ఎమ్మల్యే బీజేపీ నేత కోట శ్రీనివాసరావు మహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలు ప్రస్తావించారు... సినిమాలు గురించి విషయాలు చెప్పిన కోటా, రాజకీయాల పై కూడా మాట్లాడారు... ముందుగా సొంత పార్టీ గురించి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేరు. బీజేపీకి దాని స్థానం దానికి పదిలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం మాత్రం బీజేపీకి కష్టమే, అని అన్నారు. అలాగే ఇటు చంద్రబాబు గురించి, అటు కెసిఆర్ గురించి కూడా మాట్లడారు. కెసిఆర్ కు అన్నీ వడ్డించిన విస్తరి అని, ఆయన కష్టపడేది పెద్దగా ఏమి లేదు అని చెప్పారు.
చంద్రబాబుకి కేసేఅర్ లా కాదని, చంద్రబాబు ఎంతో కస్టపడి అన్నీ నిర్మిస్తున్నారని, అమరావతి, హైదరాబాద్ లా కావలి అంటే, మరో 20 ఏళ్ళు పడుతుంది అని, చంద్రబాబు ఉంటేనే, ఆయన కష్టంతో అన్నీ కుదురుతాయని అని అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం అనుభవాలనుంచైనా నేర్చుకోవాలి కదా అన్న ఆయన.. సినిమా వాళ్లకు రాజకీయ వాతవారణం పడదని వ్యాఖ్యానించారు. అసలు పవన్ రాజకీయాలపై ఆయనేమన్నారంటే.. "మనకెందుకు చెప్పండి... నేనే వెనక్కి వచ్చేశాను.. ఊరికే పిచ్చోడినై వచ్చానా.? రజనీకాంత్ వస్తానని చెప్పడు... వెళ్తానని చెప్పడు.
పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు .. కుర్రాడు ఆయన. వాళ్ల అన్నకు జరిగిందాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా... సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు" అన్నారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి లాంటి క్రేజ్ ఉన్న వాడే, రాజకీయాల్లో ఎక్కడ ఉన్నారో చూసాం కదా, అప్పుడు మొత్తం చిరంజీవి వెంట ఉన్నా, సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు పవన్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అయినా, ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ అన్నను చూసి అయినా, నేర్చుకోవాలిసింది అన్నారు కోటా.. అటు నాలుగు దశాబ్దాల సినీ అనుబంధం.. ఇటు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవమున్న కోట.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.