ఒక పాక్ సాక్షిలో కాని, జగన్ మీటింగ్ లో కాని, వైసిపీ నేతలు కాని, నిన్న చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మా రాజీనామాలు ఆమోదించారు అంటూ ప్రచారం చేసారు. కాని వాస్తవం ఇది. వైసీపీ ఎంపీల రాజీనామాలు మళ్లీ పెండింగ్‌లోకి వెళ్లిపోయాయి. ఎంపీల రాజీనామాపై నిన్న ఢిల్లీలో హైడ్రామా నడిచింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ ఎంపీల భేటీ తర్వాత మా రాజీనామాలు ఆమోదమైనట్లేనని మీడియాకు వెల్లడించారు. భేటీ అయ్యి 24 గంటలు గడిచినా స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ తన కార్యాలయానికి వచ్చినా.. వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే రేపటి నుంచి 10 రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మరి ఎప్పుడు రాజీనామా ఆమోదిస్తారో, అసలు ఆమోదిస్తారో లేదో, ఆ దేవుడికే తెలియాలి.
నిజానికి వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మెట్‌లో సుమిత్రామహాజన్‌కు ఇచ్చారు. వ్యక్తిగతంగా కలిసి లేఖలు ఇచ్చి రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ ఆమె పెండింగ్‌లో పెట్టారు. ఆగష్టులో మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే వరకు నిర్ణయం తీసుకోరని అందరూ భావించారు. ఈలోపే కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు చేయడంతో అప్పటికప్పుడు ఆమోదింపజేశారు. దీంతో బీజేపీ, వైసీపీ కలిసే రాజీనామా నాటకాలు ఆడుతున్నాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇవి అంతకంతకూ పెరుగుతుండటంతో చెక్‌పెట్టేందుకు సుమిత్రామహాజన్ హఠాత్తుగా ఎంపీలను పిలిచి మరీ మాట్లాడారు. 29న వారి రాజీనామాలను ఆమోదిస్తారని అందరూ అనుకున్నారు. కానీ స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. నిన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిందింగా స్పీకర్‌ను కోరారు...
అయితే, వీరి గుట్టు ఇలా బయట పడింది... రిప్రజెంటేషన్ అఫ్ పీపుల్స్ ఆక్ట్ 1951, సెక్షన్ 151-A ప్రకారం, ఏడాది లోపు ఎన్నికలు ఉంటే, ఉప ఎన్నికలు రావు.. ఒక్క రోజు గ్యాప్ తో, జగన్ ఇలా దొరికిపోయాడు.. మన ఎంపీ లు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 5 2014 న. జూన్ 5 2018 లోపు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తే, ఉప ఎన్నిక నిర్వహించాలి. అదే రాజీనామాలు జూన్ 5 తరువాత ఆమోదిస్తే జనరల్ ఎలక్షన్స్ కి సంవత్సరమే ఉంటది కాబట్టి ఎన్నికలు నిర్వహించరు. మేము చేసాము అనిపించు కోవచ్చు , ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరము లేదు. అందుకే వైసీపీ ఎంపీ ల రాజీనామాలని ఇన్ని రోజులు నడిపించారు బిజెపి వారు. ఎంతయినా ఇద్దరు ఒక్కటే కదా.. ఇవన్నీ ప్రజలకు తెలియదు, మనం డ్రామా ఆడచ్చు అని, ఇద్దరూ కలిసి అద్భుతమైన డ్రామాకి తెర దింపారు.