నేను అవినీతి పై యుద్ధం చేస్తాను.. నాకు అవినీతి చేసే వారు అంటే ఇష్టం ఉండదు... నాకు అవినీతి పై యుద్ధం చేసే కసి ఉంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్ల పై కొట్టే డైలాగ్‌లకు ప్రజలు ఇరగబడి నవ్వుతున్నారు. నిన్న జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ గా ఉందని, నేను వస్తే అవినీతి లేకుండా చేస్తా అంటూ చెప్పిన వేదాలకు, ఐటి మంత్రి నారా లోకేష్ సటైరికల్ గా స్పందించారు.. లోకేశ్ ట్వీట్ చేస్తూ... ఈరోజు శుక్రవారమని.. మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడ ఉంటారో చెప్పుకోండని ప్రశ్నించారు. అందుకోసం మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకోండి అంటూ 1.నాంపల్లి కోర్టు... 2.లోటస్ పాండ్ మహల్.. 3.బెంగళూరు మహల్ అని పేర్కొన్నారు.
ఇది లోకేష్ చేసిన ట్వీట్ Friday today. Where can we find our opposition leader? Choose among the following: 1) Nampally Court 2) Lotus Pond Mahal 3) Bengaluru Mahal... ఇది ఇలా ఉంటే చాలా రోజుల తరువాత జగన్ కి శుక్రవారం హాలిడే దొరికింది. గత నెల రోజులుగా, కోర్ట్ లకి వేసవి సెలవలు కవాటంతో, జగన్ కు కొంచెం ఊరట లభించింది. కోర్ట్ కి సెలవలు ఉండటంతో, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్ళే బాధ తప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, గత నెల రోజులుగా శుక్రవారం కోర్ట్ కి వెళ్ళటం మానేశారు. అయితే, ఈ రోజు నుంచి మళ్ళీ కోర్ట్ లు తెరుచుకున్నాయి. సరిగ్గా ఈ రోజే శుక్రవారం కావటంతో, కోర్ట్ కి వెళ్ళాల్సిన పరిస్థితి.
అందుకే నిన్న పాదయాత్ర ఆపేసి, హైదరాబాద్ వచ్చారు జగన్. ఈ రోజు, అక్రమాస్తుల కేసులో హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాలపై విచారణ జరిగింది. మరోపక్క, ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిలు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కేసు విచారణ కోసం పాదయాత్రకు ఆయన ఒక్కరోజు విరామం ప్రకటించారు.