వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో, జగన్ ఒక్కడే కాదు, జగన్ కు మించిన ఆర్ధిక నేరగాడు గాలి జనార్ధన్ రెడ్డి. ఓబులాపురం మైనింగ్ పేరుతో, ఎలా సహజ సంపద దోచుకుని, లక్షల కోట్లు కొల్లగొట్టాడో చూసాం... ఇలాంటి వాడిని, బీజేపీ వారు కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘గోవా సరిహద్దుల్లో ఇనుప ఖనిజం తవ్వకాలన్నీ సక్రమంగానే జరిగాయి. ఎక్కడా గీత దాటలేదు’ అంటూ గాలి జనార్దన రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన గనుల అక్రమాలపైనా ఇదే జరిగే ప్రమాదముందని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. సరిహద్దులను తేల్చే సర్వే పనులను కర్ణాటకతో కలిసి పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడికి శిక్ష పడి తీరాల్సిందే అనే నిశ్చయంతో ప్రభుత్వం ఉంది.

gali 07062018 2

గోవా తరహాలోనే ఏపీ, కర్ణాటక సరిహద్దు తగాదాను ముగించేందుకు తెరవెనుక రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ భావిస్తోంది. గతంలో గోవాలోనూ సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలతోనే గాలి మైనింగ్‌ అంతా సక్రమంగా సాగిపోయిందంటూ ఆ కేసులు వీగిపోయాయని... ఏపీ వి షయంలో అలా జరగొద్దని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ, కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే సంయుక్త సర్వేకు ఏపీ నుంచి ఉన్నతాధికారులు వెళ్లాల్సిందేనని ఆదేశించింది. అటవీ శాఖలో ముఖ్య సంరక్షణాధికారి కేడర్‌ అధికారులు ముగ్గురితో కూడిన కమిటీని నియమించి వెంటనే అటవీ సర్వేకు పంపించాలని సోమవారం అత్యవసర మెమో జారీ చేసింది.

gali 07062018 3

అలాగే... జిల్లా నుంచి ఓ ప్రత్యేక స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని సర్వేకు పంపించాలని అనంతపురం కలెక్టర్‌ను ఆదేశించింది. ‘ఈ బృందం రోజువారీగా జిల్లా కలెక్టర్‌తో భేటీ అవుతూ ఎప్పటికప్పుడు సర్వే పురోగతిపై సమీక్షించాలి. సర్వేకు అవసరమైన గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్స్‌, సర్వే విధానం ఖరారైన తర్వాతే ఏపీ తరఫున అభిప్రాయాలు, విధానాలను సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా కు నివేదించాలి’ అని సర్కారు దిశా నిర్దేశం చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని లోపల వెయ్యాలని, సహజ సంపద కొల్లగొట్టి బయట తిరుగుతూ ఉన్న ఇలాంటి వాడిని, బీజేపీ వెనకేసుకు రావటం చూస్తుంటే, ఆశ్చరంగా ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే అన్నీ పక్కాగా ఉంటే, ఎవరూ తప్పించుకోవటం కుదరదని, అప్పుడు చట్ట ప్రకారం కోర్ట్ లు తీర్పు ఇచ్చి తీరుతాయని, ప్రభుత్వం భావిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read