మన రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టటానికి, ఢిల్లీ ఆధ్యర్యంలో, కొన్ని తోడేళ్ళు హైదరాబాద్ నుంచి, మన రాష్ట్రానికి వచ్చి, మన మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఒక ప్రాంతం వెళ్లి, ఇంకో ప్రాంతం అభివృద్ధి అయిపోతుంది అని ఏడవటం వీరి పని.. చంద్రబాబు మాత్రం, మూడు ప్రాంతాలని సమానంగా చూస్తున్నారు. కోస్తాలో అమరావతి కేంద్రంగా పరిపాలన, హెల్త్, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నారు. సీమలో తిరుపతి కేంద్రంగా, ఎలక్ట్రానిక్స్ హబ్ గా, ఉత్తర కోస్తాలో విశాఖ కేంద్రంగా ఆర్ధిక రాజాధానిగా తయారు చేస్తున్నారు. చెప్పటమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా. అయినా, కొంత మంది వచ్చి, మన మధ్యే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి సమాధానమా అన్నట్టు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే స్వచ్ఛత సర్వేక్షణ్‌ పురస్కారాల్లో కూడా మూడు ప్రాంతాలకి అవార్డులు వచ్చాయి.

andhra 24062018 2

దేశంలోని, టాప్ టెన్‌ క్లీన్ సిటీల్లో, మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌వే! 5, 6, 7 ర్యాంకుల్లో వరుసగా విజయవాడ, తిరుపతి, విశాఖ నిలిచాయి. కోస్తా నుంచి విజయవాడ, సీమ నుంచి తిరుపతి, ఉత్తర కోస్తా నుంచి విశాఖ టాప్ స్థానాల్లో నిలిచి, చంద్రబాబు మూడు ప్రాంతాలని ఎలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో తెలియచేసింది. ఒంగోలుకు 83, చిత్తూరుకు 95, తెనాలికి 108, కాకినాడకు 118, నరసరావుపేటకు 120, గుంటూరుకు 129, రాజమహేంద్రవరానికి 138, విజయనగరానికి 154, కడపకు 163 ర్యాంకులు దక్కాయి. 10 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో విజయవాడ స్వచ్ఛ సిటీగా ఎంపిక కాగా, 3 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల్లో తిరుపతి సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ నగరంగా ఎంపికైంది.

andhra 24062018 3

దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణలో సత్తా చాటిన నగరాలు, మున్సిపాలిటీలకు కేంద్రం ప్రభుత్వం శనివారం అవార్డులు అందజేసింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలో లక్షకు పైబడిన జనాభా ఉన్న మున్సిపాలిటీలు 485 ఉండగా, మన రాష్ట్రంలోనే 31 ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ 262 ర్యాంకుల్లోపే నిలవడం విశేషమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పని చేయడంతోపాటు స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. నాలుగేళ్లలో మున్సిపాలిటీల స్థితిగతులను ఎంతో మెరుగు పరిచినట్లు నారాయణ చెప్పారు. ఈ విషయంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా మరింత మెరుగ్గా పని చేసి, దేశంలోని 10 అగ్రగామి మున్సిపాలిటీల్లో అన్నీ రాష్ట్రానికి చెందినవే ఉండేలా చూడాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read