ఒక పక్క విభజన హామీలు నెరవేర్చమంటే, ఎదురు దాడికి దిగుతుంది కేంద్రం. రాష్ట్రంలోని కొన్ని పార్టీలతో కలిసి డ్రామాలు ఆడుతుంది. రాజకీయంగా, తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మరింత దూకుడుగా, మరో రాజకీయ అడుగు వేసింది కేంద్రం. దీనికి ఏపి ప్రభుత్వం కూడా సై అంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో ఐదు నెల్లలో నిర్వ‌హించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సైతం జమిలి ఎన్నికల మీద ప్రకటన చేశారు ప్రధాని మోడీ. అయితే చంద్రబాబు దానికి నవ్వి ఊరుకుననట్టుగా వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా మారిన రాజకీయాలతో సార్వత్రిక ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. మొన్నటి దాకా సాధారణ ఎన్నికలకు మరో 11 నెలల సమయం ఉందని భావించిన రాజకీయపార్టీలకు తాజాగా బిజెపి వేస్తోన్న ఎత్తులు గమనిస్తున్నాయి.

cbn 25062018 2

ఎట్టి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలను 2018లోనే జరపాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దీంతో ఎన్నికల గడువుకు మరో నాలుగు నెలల ముందే ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వచ్చే ఏడాదిలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాటిని సార్వత్రిక ఎన్నికలతోనే జరిపించాలని బిజెపి పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా డిసెంబర్‌ మాసాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి 2019మే మాసంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రాకు కూడా ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు ఆఫ్ ద రికార్డుగా ప్రస్తావిస్తున్నారు. మరో ఐదు నెలల పాలనను వదులుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. డిసెంబర్‌ మాసంలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ఐదు నెలలకు మించి కాలం లేదు.

cbn 25062018 3

గత నాలుగేళ్ల కాలంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం అనుకోకుండా వస్తోన్న ఎన్నికల వల్ల లాభపడుతుందా ? లేక నష్టపోతుందా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే జరుగుతోంది. కొన్ని మాసాల క్రితం ఆంధ్రాకు బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ టిడిపి ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై టిడిపి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, నమ్మించి గొంతు కోశారని ఆరోపిస్తూ ప్రజల్లో సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చే ప్రయత్నం చేసారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందన్న టిడిపి నాయకుల వాదనతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపి అధినేత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముందుగా వస్తే తమకే లాభం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీ గెలుస్తుందన్న సర్వే ఫలితాలతో చంద్రబాబు ఖుషీగా ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read